Door43-Catalog_te_tn/1co/06/04.md

4.0 KiB

మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి

ప్రత్యామ్నాయ అనువాదం: “దైనందిన జీవితాలను గూర్చి నిర్ణయాలు తీసుకోవడం మీ బాధ్యత గదా.” లేక “ఈ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలను మీరు పరిష్కరించుకోవాలి గదా.” (యు. డి. బి.).

వాటిని పరిష్కరించడానికి

“మీరు అలాటి వాటిని ఇతరులకు అప్పగించకూడదు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

సంఘంలో ఎలాటి స్థానం లేని వారి

పౌలు ఇక్కడ కొరింతీయులను వారు ఇలాటి విషయాలలో వ్యవహరిస్తున్న తీరుని బట్టి గద్దిస్తున్నాడు. దీనికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు 1). “మీరు అలాటి వాటిని సంఘంలో అలాటి అర్హత లేని వారికి అప్పగించకూడదు.” or 2). “మీరు అలాటి విషయాలను సంఘం బయటి మనుషులకు నివేదించడం మానుకోవాలి.” లేక 3). “మీరు ఇలాటి వాటిని సంఘం సభ్యులైనా ఇతర విశ్వాసుల మధ్య సరి అయిన స్థానం లేని వారికి ఇవ్వకూడదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న).

మీరు సిగ్గుపడాలని

ప్రత్యామ్నాయ అనువాదం: “మీ పరువు పోవాలని” లేక “ఈ విషయంలో మీరెలా తప్పిపోయారో చూపించాలని.” (యు. డి. బి.).

సోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా?

ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు విశ్వాసుల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం మీలో వివేకి అయిన విశ్వాసిని నియమించుకోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

వివాదం

“వాగ్వాదం” లేక “అభిప్రాయ భేదం.”

అయితే

ప్రత్యామ్నాయ అనువాదం: “మరి ఇప్పుడు అలా ఎందుకు ఉంది?” లేక “అయితే దానికి బదులు” (యు. డి. బి.).

ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!

ప్రత్యామ్నాయ అనువాదం: “ఒకరితో ఒకరికి వివాదాలున్న విశ్వాసులు అవిశ్వాసి అయిన న్యాయాధికారి తమకోసం తీర్పు తీర్చాలని వెళుతున్నారు.”

న్యాయాధికారి ఎదుట!

“ఒక విశ్వాసి ఆ వ్యాజ్యం అప్పగిస్తున్నాడు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).