Door43-Catalog_te_tn/1co/06/01.md

3.8 KiB

వివాదం

ప్రత్యామ్నాయ అనువాదం: “అభిప్రాయ భేదం.” లేక “వాగ్వాదం.”

న్యాయాధిపతి ఎదుట

స్థానిక ప్రభుత్వ న్యాయాధిపతి కేసులను విచారించి న్యాయం చెప్పే చోట.

పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా?

క్రైస్తవులు తమ మధ్య తలెత్తే వివాదాలు తమలోనే పరిష్కరించుకోవాలి అని పౌలు చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సాటి విశ్వాసికి వ్యతిరేకంగా మీ అభియోగాలు అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట పరిష్కరించుకోవద్దు.” (చూడండి: అలంకారిక ప్రశ్న).

పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా?

లోకానికి తీర్పు తీర్చడంలో భవిషత్తులో జరగబోయే దాన్ని పౌలు సుచిస్తున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా?

పౌలు

భావికాలంలో లోకమంతటికీ తీర్పు తీర్చేది మీరే. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న తగాదాలను మీ మధ్యనే మీరు పరిష్కరించుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు భవిషత్తులో లోకానికి తీర్పు తీరుస్తారు. కాబట్టి ఇప్పుడు అలాటివి మీరే పరిష్కరించుకోండి.” (చూడండి: అలంకారిక ప్రశ్న).

విషయాలను

“తగాదాలు” లేక “అభిప్రాయ భేదాలు.”

మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని?

“మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని మీకు తెలుసు.”

(చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మనం

పౌలు ఇక్కడ కొరింతీయులతో తనను కలుపుకుంటున్నాడు. (చూడండి: కలుపుకొన్న).

మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవదూతలకు తీర్పు తీర్చే సామర్థ్యం, బాధ్యత దేవుడు మనకు ఇస్తాడు గనక, మనం తప్పకుండా ఇలాటి విషయాలను చక్కబెట్టుకోవచ్చు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).