Door43-Catalog_te_tn/1co/04/06.md

2.1 KiB

మీరు గ్రహించాలని

“మీ క్షేమం కోసం.”

రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు

“లేఖనాల్లో రాసిన వాటిని వ్యతిరేకించ వద్దు.” (TFT).

నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి?

పౌలు ద్వారా, లేక అపోల్లో ద్వారా సువార్తను నమ్మాము గనక తాము ఇతరులకంటే గొప్ప వారమని భావిస్తున్న కొరింతీయులను పౌలు గద్దిస్తున్నాడు.

ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఇతర మనుషుల కంటే అధికులేమీ కాదు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి?

వారికి ఉన్నవన్నీ దేవుడు వారికి ఉచితంగా ఇచ్చాడని పౌలు నొక్కి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకున్నదంతా దేవుడు మీకిచ్చినవే.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

గొప్పలు చెప్పుకోవడమెందుకు?

తాము పొందిన వాటి వాటి సంగతి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నందుకు పౌలు వారిని గద్దిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు గొప్పలు చెప్పుకునే హక్కు లేదు” లేక “ఏ మాత్రం గొప్పలు చెప్పుకోవద్దు.” (చూడండి: అలంకారిక ప్రశ్న).