Door43-Catalog_te_tn/1co/03/08.md

1.7 KiB

నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే

నాటడం, నీరు

పోయడం ఒకే రకమైన పని అని కొరింతు సంఘం పరిచర్య విషయంలో పౌలు తనను అపొల్లోతో పోల్చుకుంటూ ఉన్నాడు.

ప్రతిఫలం

ఒక పనివాడు ఎంత బాగా పని చేశాడు అనే దాన్ని బట్టి అతని జీతం ఉంటుంది.

మేము

పౌలు, అపొల్లో గురించి చెప్పిన మాట. కొరింతు సంఘం గురించి కాదు. (చూడండి: విశేషాత్మక).

దేవునితో కలిసి పని చేసే వాళ్ళం

పౌలు తనను, అపొల్లోను దేవునితో కలిసి పని చేసే జత పనివారిగా ఎంచుతున్నాడు.

దేవుని పొలం

మనుషులు ఒక తోట బాగా కాపుకు రావాలంటే ఎలా చేస్తారో దేవుడు కొరింతు విశ్వాసుల సంగతి అలా శ్రద్ధ తీసుకుంటాడు. (చూడండి: రూపకాలంకారం).

దేవుని కట్టడం

దేవుడు కొరింతు విశ్వాసులను ఒకడు ఒక కట్టడం నిర్మించినట్టు రూపొందించి సృష్టించాడు. (చూడండి: రూపకాలంకారం).