Door43-Catalog_te_tn/1co/03/01.md

1.7 KiB

ఆత్మసంబంధులైన

ఆత్మ ప్రభావం కింద ఉండే వారు.

శరీర స్వభావం గలవారితోనూ

తమ స్వంత కోరికల ప్రకారం నడుచుకునే వారు.

క్రీస్తులో పసిబిడ్డలతోనూ

కొరింతీయులను వయసులో, అవగాహనలో చాలా పసి పిల్లలుగా పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తులో పసి విశ్వాసులుగా.” (చూడండి: రూపకాలంకారం).

పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు

పాలు మాత్రమే తాగగల చిన్న పిల్లల వలె కొరింతీయులు తేలికపాటి సత్యాలను మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎదిగిన పిల్లలు బలవర్థకమైన ఆహారం తిన్నట్టుగా వారు పెద్ద సత్యాలను విని గ్రహించలేరు. (చూడండి: రూపకాలంకారం).

తీసుకునే స్థితిలో లేరు

“మీరు క్రీస్తును అనుసరించడంలో మరింత కష్టమైన బోధనలు అర్థం చేసుకోలేరు.” (స్పష్టమైన, అంతర్గతమైన).