Door43-Catalog_te_tn/1co/01/20.md

2.3 KiB

జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు?

నిజమైన జ్ఞానులు ఎక్కడా కనిపించడం లేదని పౌలు నొక్కి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సువార్తలోని జ్ఞానంతో పోల్చుకుంటే జ్ఞానులు గానీ, విద్వాంసులు గానీ తర్క వేత్తలు గానీ లేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న).

జ్ఞాని

గొప్ప విద్యావంతుడుగా గుర్తింపు పొందిన వాడు.

తర్కవాది

తర్క వాది అంటే తనకు తెలిసిన దాన్ని గురించి నైపుణ్యంగా వాదించే వాడు.

ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా?

పౌలు దేవుడు ఇహలోక జ్ఞానాన్ని ఏమి చేశాడో చెప్పడానికి పౌలు ఈ మాట రాస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు నిజంగా ఇహలోక జ్ఞానం తెలివితక్కువతనంగా అయిపోయేలా చేశాడు.” లేక “వారు పిచ్చితనంగా ఎంచిన సందేశాన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు.” (యు. డి. బి.). (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

నమ్మేవారిని

దీనికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు 1). “దాన్ని నమ్మిన వారందరికీ” (యు. డి. బి.). or 2). “తనపై నమ్మకం ఉంచిన వారికి.”