Door43-Catalog_te_tn/phm/01/17.md

3.2 KiB

అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే

“క్రీస్తు కోసం నేను నీ సాటి పనివాడిగా భావిస్తే.”

బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నా దగ్గర వసూలు చెయ్యి.” లేక “నీకు చెల్లించేది నేనే అని చెప్పు.”

పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “నేను, పౌలును, నేనే ఇది రాస్తున్నాను.” ఫిలేమోను ఈ మాటలు వాస్తవమని నమ్మాలని పౌలు రాస్తున్నాడు; పౌలు నిజంగా అతనికి చెల్లిస్తాడు.

ఆ బాకీ నేనే తీరుస్తాను

“అతడు నీకు ఉన్న బాకీ నేను తీరుస్తాను.”

నేను ప్రస్తావించడం లేదు

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నేను నీకు గుర్తు చెయ్యనవసరం లేదు.” లేక “నీకు తెలుసు.”

అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని

“నీకు ఉన్న జీవం నా వల్లనే.” ఫిలేమోను జీవం పొందడానికి కారణం పౌలు అనే దాన్ని స్పష్టంగా చెప్పవచ్చు : “నీవు నాకు బాకీ ఉన్నావు, ఎందుకంటే నీకు జీవం కలిగింది నా వల్లనే.” లేక “నేను చెప్పిన దాని వల్లనే నీకు జీవం కలిగింది.” ఫిలేమోను ఒనేసిముగానీ ఒనేసిము

విషయంలో పౌలు గానీ తనకు బాకీ అని అనకూడదు అని పౌలు ఉద్దేశం. ఎందుకంటే అతడు పౌలుకే బాకీ ఉన్నాడు. (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)

నా హృదయానికి సేద తీర్చు

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నా హృదయం సంతోష పెట్టు.” లేక “నన్ను అనందపరచు.” లేక “నన్ను ఆదరించు.” ఫిలేమోను దీన్ని ఎలా చెయ్యాలో స్పష్టం చెయ్యవచ్చు: “ఒనేసిమును దయతో స్వీకరించడం ద్వారా.”