Door43-Catalog_te_tn/phm/01/14.md

3.1 KiB

అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు

“నీ అనూమతి లేకుండా ఇక్కడ ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు.” లేక “నీవు సరేనంటేనే నాతో ఉంచుకోవాలనుకున్నాను.”

నీ…నీవు

14

16 వచనాల్లో ఈ నామవాచకాలు ఏక వచనం. ఫిలేమోనుకు వర్తిస్తుంది. (చూడండి: “నీవు” రూపాలు)

బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “నేను నిన్ను బలవంతం చేస్తున్నానని కాదు గానీ, నీవు సరి అయినది చేస్తావని.”

ఇష్టపూర్వకంగా

“నీకు ఇష్టం కాబట్టి.” లేక “సరి అయినది ఎలాటి బలవంతం లేకుండా చేస్తావని.”

నీకు దూరమయ్యాడు కాబోలు

ఈ కర్మణి వాక్యాన్ని కర్తరి క్రియా పదంతో ఇలా తర్జుమా చెయ్యవచ్చు: “ఒకవేళ దేవుడు ఒనేసిమును నీ నుండి తీసివేసాడేమో.” (చూడండి: కర్తరి లేక కర్మణి)

బహుశా

“ఒక వేళ.”

కొంతకాలం

“ఈ సమయంలో.”

బానిసగా మాత్రమే కాక

“బానిస కంటే మెరుగుగా” లేక “బానిసకన్నా విలువనిచ్చి.”

ప్రియమైన సోదరుడు

“ఒక ప్రియ సోదరుడు” లేక “విలువైన సోదరుడు.”

సోదరుడు

“క్రీస్తులో సోదరుడు.”

మరి ముఖ్యంగా నీకూ

“తప్పనిసరిగా మీకు మరి ఎక్కువగా.”

శరీర బంధాన్ని బట్టీ

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “మనిషిగా” లేక “మానవ సంబంధం పరంగా.” మానవ సంబంధం అనే దాన్ని మరింత స్పష్టం చెయ్యవచ్చు: “అతడు నీ బానిస గనక.” (చూడండి: స్పష్టం, అంతర్గతం)

ప్రభువును బట్టీ

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “ప్రభువులో సోదరునిగా.” లేక “అతడు ప్రభువుకు చెందిన వాడు గనక.”