Door43-Catalog_te_tn/phm/01/10.md

5.6 KiB

ఒనేసిము

ఇది పురుషుని పేరు. (చూడండి: పేర్లు తర్జుమా)

నా బిడ్డ ఒనేసిము

“నా కుమారుడు ఒనేసిము.” పౌలు

ఒనేసిము తో తన సంబంధం తండ్రి, కుమారుల సంబంధం అని చెబుతున్నాడు. ఒనేసిము పౌలుకొడుకు కాదు. పౌలు అతనికి యేసును గురించి బోధించినప్పుడు అతడు ఆత్మ సంబంధమైన జీవం పొందాడు. పౌలు అతన్ని ప్రేమించాడు. దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నా ప్రియ కుమారుడు ఒనేసిము” లేక “నా ఆత్మ సంబంధమైన కుమారుడు ఒనేసిము.” (చూడండి: రూపకం)

అతడు నాకు కొడుకయ్యాడు

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నాకు కుమారుడు అయ్యాడు.” లేక “నా కొడుకు వంటి వాడయ్యాడు.” ఒనేసిము పౌలుకు కుమారుడు ఎలా అయ్యాడన్నది స్పష్టం చెయ్యవచ్చు. :

“నేను అతనికి క్రీస్తును గురించి నేర్పించగా అతడు నూతన జీవం పొంది నా ఆత్మ సంబంధమైన కుమారుడు అయ్యాడు.”

(చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)

నేను చెరలో ఉన్నపుడు

“నా గొలుసుల్లో.” దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నేను చెరసాలలో ఉండగా.” ఖైదీలను గొలుసులతో కట్టేసేవారు. పౌలు ఒనేసిముకు బోధించినప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఈ ఉత్తరం రాసినప్పుడు కూడా. (చూడండి: అన్యాపదేశం)

గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు, కొత్త వాక్యంతో: “ఇది వరకు నీకు పనికి రాని వాడే.”

నీకూ నాకూ ప్రయోజనకారి

“కానీ ఇప్పుడు పనికి వచ్చే వాడయ్యాడు.” అనువాదకులు ఇక్కడ ఫుట్ నోట్ పెట్టవచ్చు. “ఒనేసిము అనే పేరుకు ప్రయోజకుడు లేక పనికి వచ్చే వాడు అని అర్థం.”

అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను

“ఒనేసిమును నీ దగ్గరికి పంపుతున్నాను.” పౌలు

బహుశా తానే ఈ పత్రిక ఒనేసిమును పంపుతూ రాస్తున్నాడు గనక దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “నేను అతన్ని తిరిగి నీ దగ్గరికి పంపుతున్నాను.” (యు డి బి).

నా ప్రాణంతో సమానమైన

ఇక్కడ ప్రాణం అనే మాట తనకు ఎంతో ప్రియమైన వాడిని సూచిస్తున్నది. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు“నేను చాలా ఇష్టంగా ప్రేమించే వాడు.” పౌలు ఇది ఒనేసిము గురించి రాస్తున్నాడు. (చూడండి: అన్యాపదేశం)

నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను

దీన్ని కొత్త వాక్యం ఇలా తర్జుమా చెయ్య వచ్చు: “అసలు నాతోనే ఉంచుకోవాలనుకున్నాను.”

నీ పక్షాన నాకు సాయం చేయడానికి

“నీవిక్కడ లేవు కాబట్టి అతడు నాకు సాయం చెయ్య వచ్చు గదా. దీన్ని వేరే వాక్యంతో ఇలా తర్జుమా చెయ్యవచ్చు : నీకు బదులుగా నాకు సహాయంగా ఉంటాడు.“

సంకెళ్ళలో ఉంటే

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు: “నేను చెరసాలలో ఉన్నప్పుడు” లేక “నేను చెరసాలలో ఉన్నాను గనక.”

నేను సువార్త కోసం

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు “నేను సువార్త ప్రకటిస్తున్నాను గనక.”