Door43-Catalog_te_tn/phm/01/04.md

3.0 KiB

ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను

“మీకోసం ప్రార్థించినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. (యు డి బి).

నేను

ఈ ఉత్తరం పౌలు రాశాడు

ఈ ఉత్తరంలో “నేను” అంటే పౌలు.

నీకున్న

ఇక్కడ, పత్రిక అంతటిలోనూ “నీవు” అనే మాట ఫిలేమోనుకు వర్తిస్తుంది. (చూడండి: ‘నీవు’ రూపాలు)

నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వలన ఇతరులు నీ విశ్వాసంలో భాగస్తులు అవుతూ ఉండాలని

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “నీవు మాలాగే క్రీస్తులో నమ్మకం ఉంచడం నిన్ను గ్రహించేలా చేస్తుంది.”

లేక “క్రీస్తును నమ్మడంలో నివు మాతో కలిసావు కాబట్టి నీవు తెలుసుకోగలుగుతావు.”

నీ విశ్వాసంలో భాగస్తులు అవుతూ

“మా లాగానే నీవు క్రీస్తుపై విశ్వాసం ఉంచావు గనక.” (యు డి బి)

క్రీస్తులో మనకు ఉన్న

దీనికి బహుశా అర్థం ఏమిటంటే “క్రీస్తు మూలంగా.”

పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు

ఇక్కడ “హృదయాలు” అంటే విశ్వాసుల ధైర్యం. అంతేగాక, “నేను సేద దీరాను” అనేది కర్మణి పదం. దీన్ని కర్తరి క్రియా పదంతో ఇలా తర్జుమా చెయ్యవచ్చు: “విశ్వాసులకు సేదదీర్చావు.” (చూడండి: అన్యాపదేశం కర్తరి, కర్మణి)

సోదరా

పౌలు ఫిలేమోనును “సోదరుడు” అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరూ విశ్వాసులు. అతడు బహుశా తమ మధ్య ఉన్న స్నేహం గురించి చెబుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “ప్రియ సోదరుడు,”

లేక “ప్రియ స్నేహితుడు.”