Door43-Catalog_te_tn/phm/01/01.md

3.4 KiB

ఇది పౌలు ఫిలేమోను అనే వ్యక్తికి రాసిన పత్రిక.

క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు

మీ భాషలో పత్రిక రచయితను పరిచయం చెయ్యడానికి ఒక విధానం ఉండవచ్చు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “క్రీస్తు యేసు ఖైదీ పౌలు, మన సోదరుడు తిమోతి, ఫిలేమోనుకు ఈ పత్రిక రాస్తున్నారు.”

క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు

“యేసు క్రీస్తును ప్రకటించినందుకు చెరసాలలో ఉన్న.” యేసు అంటే గిట్టని వారు పౌలును చెరసాలలో వెయ్యడం ద్వారా శిక్షించారు.

మా ప్రియ సోదరుడు

“ప్రియమైన సాటి విశ్వాసి” లేక “మనం ప్రేమించే ఆత్మ సంబంధమైన సోదరుడు.”

జతపనివాడు అయిన ఫిలేమోనుకు

“మనలాగానే సువార్త వ్యాప్తికి కృషి చేస్తున్న.”

మన సోదరి అప్ఫియకు

అంటే “మన సాటి విశ్వాసి అప్ఫియ” లేక “అప్ఫియ, మన ఆత్మ సంబంధమైన సోదరి” (చూడండి: పేర్లు తర్జుమా)

అర్ఖిప్పుకు

ఇది పురుషుని పేరు.

మన సాటి సైనికుడు

ఇక్కడ “సైనికుడు” అనేది రూపకాలంకారం. సువార్త ప్రచారానికి పాటు పడే వ్యక్తిని ఇది సూచిస్తుంది. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు“మన సాటి ఆత్మ సంబంధమైన వీరుడు” లేక “మనతో కలిసి ఆత్మ సంబంధమైన పోరులో పాల్గొనే.” (చూడండి: రూపకం)

నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ

“నీ ఇంట్లో సమావేశం అయ్యే విశ్వాసులు.” (యు డి బి)

నీ ఇంట్లో

“మీ” అనేది ఏక వచనం. ఫిలేమోనుకు వర్తిస్తుంది.

క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

“మన తండ్రి అయిన దేవుడు, ప్రభు యేసు క్రీస్తు మీకు కృప, శాంతి అనుగ్రహించు గాక.” ఇది ఆశీర్వాదం. “మీకు” అనేది బహువచనం. పౌలు 1, 2 వచనాలలో చెప్పిన వారంతా.