Door43-Catalog_te_tn/jud/01/12.md

4.4 KiB

యూదా రూపకాలంకారాలు కొనసాగిస్తున్నాడు

వీరు

“వీరు” అంటే భక్తి లేని మనుషులు.

నీటిలో దాగిన బండల్లా ఉన్నారు

ఓడలను ముంచేసే నీటి కింది బండల వలె ఈ మనుషులు విశ్వాసులకు ప్రమాద కరంగా ఉంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీటిలో మునిగి ఉన్న ప్రమాదకరమైన బండల వంటి వారు.” (రూపకాలంకారం, చూడండి)

విందుల్లో మీతో భోజనం చేస్తూ

“మీ సహవాస భోజనాల్లో ఎప్పుడూ మీతో కలిసి భోజనం చేస్తున్నారు.”

నీళ్ళులేని మేఘాలు

తోటలకు నీరు కురిపించని మబ్బుల వంటి వారు. వీరికి విశ్వాసులపై శ్రద్ధ లేదు. (రూపకాలంకారం. చూడండి)

ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా

కొన్ని చెట్లు ఎండా కాలం చివర్లో కాయలు కాయవు. అలానే ఈ భక్తి లేని మనుషుల్లో విశ్వాసం, నీతిన్యాయ సంబంధమైన క్రియలు లేవు. (రూపకాలంకారం. చూడండి)

పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి

చలిమంచు వల్ల ఒక సారి, పళ్ళు కాయనందు వల్ల మరొక సారి చచ్చినట్టు. అలానే భక్తీ లేని మనుషులకు విలువ లేదు, వారిలో జీవం లేదు.(చూడండి, రూపకం)

వేళ్ళతో సహా పెళ్ళగించిన

వేర్లతో సహా భూమి లోనుండి పెళ్ళగించ బడిన చెట్లలాగా భక్తి హీనులు జీవానికి మూలం అయిన దేవుని నుండి వేరై పోయారు. (రూపకాలంకారం. చూడండి)

సముద్రంలోని అలల

సముద్రం అలలు పెను గాలులకు ఎగిసి పడినట్టు భక్తి హీనులకు విశ్వాసం పునాది లేదు. ఎన్నెన్నో విషయాలు వారిని చెల్లాచెదరు చేస్తుంటాయి. (రూపకాలంకారం. చూడండి).

నురగలాగా వారి సొంత అవమానం

పెను గాలులకు సముద్రం అల్లకల్లోలం అయి మురికిగా కనిపించే నురగ రేగినట్టు ఈ మనుషులు తమ అబద్ధ ఉపదేశాల, చర్యల మూలంగా తమను అవమానపరచు కుంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: “కెరటాలు నురగ లేపినట్టుగానే ఈ మనుషులు అవమానం రేపుతూ ఉంటారు.” (రూపకాలంకారం. చూడండి)

వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం

కొన్ని నక్షత్రాలు వాటి కక్ష్య ఎదో తెలియని రీతిలో వాటిని చూసి నావికులు ప్రయాణం చెయ్యడానికి వీలు లేకుండా తిరుగు తుంటారు. కాబట్టి మీరు ఇలాటి మనుషులను అనుసరించ కూడదు. (రూపకాలంకారం. చూడండి)