Door43-Catalog_te_tn/jud/01/09.md

1.8 KiB

శరీరాన్ని గూర్చి వాదిస్తూ

శరీరం విషయంలో. ప్రత్యామ్నాయ అనువాదం: “శరీరాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలని వాదించుకున్నారు.” (చూడండి స్పష్టమైన, అంతర్గతమైన)

మిఖాయేలు ... నేరం మోపడానికి తెగించలేదు

సాతానును మందలించడానికి పూనుకోలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: “నిగ్రహించుకున్నాడు.”

అవమానకరంగా మాట్లాడలేదు

“తీవ్ర విమర్శ, అమర్యాద మాటలు.”

కాని వీరు

“వీరు” దైవ భక్తి లేనివారు. ఇంతకు ముందు ప్రస్తావించిన వారు.

తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు

“తమకు తెలియని వాటి గురించి అమర్యాదగా మాట్లాడుతారు.”

కయీను మార్గంలో

కయీను తన సోదరుడు హేబెలును హత్య చేశాడు.

బిలాము దోషంలో

బిలాము డబ్బుకోసం ప్రవచనం చెప్పడానికి పూనుకున్నాడు.

కోరహు తిరుగుబాటులో

కోరహు మోషే నాయకత్వంపైనా, అహరోను యాజకత్వం పైనా తిరగబడ్డాడు.