Door43-Catalog_te_tn/jud/01/07.md

2.2 KiB

అదే విధంగా

కేటాయించిన స్థానాలు విడిచిపెట్టిన దేవదూతలతో సొదొమ, గొమొర్రా మనుషులను పోలుస్తున్నాడు.

వాటి చుట్టూ

“సమీపంలో ఉన్న పట్టణాలు.”

అదే విధంగా

దేవదూతలు తమను దుర్మార్గతకు అప్పగించుకున్నట్టే సొదోమ, గొమొర్రా లైంగిక దుర్నీతికి తమను ఇచ్చేసుకున్నారు.

జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ

మనుషులు పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక క్రియలకు పాల్పడ్డారు. అంతేగాక పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో లైంగిక సంబంధం నెరిపారు.

అప్పగించుకున్నారు

“సొదోమ, గొమొర్రా మనుషులు.”

వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు

దేవుణ్ణి నిరాకరించిన వారికి

సొదోమ, గొమొర్రా మనుషుల వినాశనం ఒక ఉదాహరణగా నిలిచింది.

అపవిత్రం

దేవుణ్ణి నిరాకరించి వారి శరీరాలను లైంగిక దుర్నీతితో కలుషితం చేసుకున్నవారు, ఏదైనా సెలయేరులోకి చెత్త అంతా పడేస్తూ ఉంటే ఆ నీరు తాగడానికి పనికి రానట్టు చెడి పోయిన వారు.

దేవుని మహిమ రూపులను

“దేవుని అద్భుత దేవదూతలు.”