Door43-Catalog_te_tn/jud/01/03.md

2.4 KiB

మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా

“మీకు రాయాలని చాలా ఆత్రుతగా ఉన్నాను.” (చూడండి, “నీవు” రూపాలు)

మనకందరికీ చెందిన రక్షణ

“మనందరం ఒకే రక్షణ పంచుకున్నాము.” (చూడండి, కలుపుకున్న)

రాయవలసి వచ్చింది

“రాయాలని గొప్ప అవసరత కనిపించింది.” లేక “త్వరగా రాయాలి అనిపించింది.”

విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ

“మీరు నిజమైన ఉపదేశానికి కొమ్ము కాయలని ప్రోత్సహిస్తూ.”

అప్పగించిన

“దేవుడు ఈ నిజమైన ఉపదేశం ఇచ్చాడు.”

ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా

“ఎందుకంటే కొందరు మనుషులు చాప కింద నీరు లాగా విశ్వాసుల మధ్యచొరబడ్డారు.”

శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది

“ఈ మనుషులకు శిక్ష ఉంటుంది అని ముందే రాసి ఉంది.”

దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి,

“దేవుని కృప మనిషిని లైంగిక పాపంలో కొనసాగడానికి అనుమతి ఇస్తుందని వారు బోధిస్తారు.”

మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు.

ఈ మనుషులు దేవుని చెంతకు యేసు క్రీస్తు నిజమైన, లేక ఏకైక మార్గం అనే మాటను నిరాకరిస్తారు.

నిరాకరిస్తున్నారు

ఒక విషయం వాస్తవం కాదని చెప్పడం.