1.9 KiB
1.9 KiB
మత్తయి 07 సాధారణ నోట్సు
నిర్మాణము, పరిమాణము
యేసు ఈ ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావిస్తున్నాడు. యేసు అంశం మార్చిన ప్రతిసారీ ఖాళి లైను ఉంచడం ద్వారా పాఠకునికి సౌలభ్యం కల్పించ వచ్చు.
ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు
మత్తయి 5-7
ఈ భాగాన్ని కొందరు 5-7 కొండమీద ప్రసంగం అంటారు. ఇది యేసు బోధించిన సుదీర్ఘ ప్రసంగ పాఠం. బైబిల్ దీన్ని మూడు అధ్యాయాలుగా విడగొట్టింది. అయితే ఇది పాఠకుని అయోమయానికి గురి చెయ్యవచ్చు. నీ అనువాదం వాచకాన్ని భాగాలుగా చూపిస్తే ఇదంతా ఒకే పెద్ద ప్రసంగం అని పాఠకునికి అర్థం అయ్యేలా జాగ్రత్త పడండి.
""వారి ఫలాల వల్ల నీవు వారిని గుర్తిస్తావు""
ఫలం అనేది లేఖనాల్లో తరచుగా కనిపించే అలంకారిక భాష. వారి మంచి, లేక చెడ్డ క్రియలను సూచించడానికి ఇది వాడతారు. ఈ అధ్యాయంలో మంచి ఫలం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం. (చూడండి: rc://*/tw/dict/bible/other/fruit)