2.2 KiB
2.2 KiB
1 థెస్సలొనీకయులు 04 సాధారణ గమనికలు
ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
లైంగిక అనైతికత
వివిధ సంస్కృతులు లైంగిక నైతికత విషయంలో భిన్నమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ విభిన్న సాంస్కృతిక ప్రమాణాలు ఈ భాగాన్ని తర్జుమా చేయడాన్ని కష్టతరం చేస్తాయి. సాంస్కృతిక నిషేధాల గురించి అనువాదకులు కూడా అప్రమత్తులై ఉండాలి. ఇవి చర్చించటానికి అనుచితమైన అంశాలు.
క్రీస్తు తిరిగి రాకముందే మరణించడం
ప్రారంభ సంఘంలో, క్రీస్తు తిరిగి రాకముందే విశ్వాసి మరణిస్తే ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు దేవుని రాజ్యంలో భాగమేనా అని వారు భయపడి ఉండవచ్చు. పౌలు ఆ ఆందోళనకు సమాధానమిచ్చాడు.
""ఆకాశమండలంలో ప్రభువును కలవడానికి మేఘాలపై తీసుకెళ్లబడడం""
ఈ భాగం యేసు తనను నమ్మిన వారిని తనను తాను పిలిచే సమయాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు యొక్క చివరి అద్భుతమైన రాకడని సూచిస్తుందా లేదా అనే దానిపై పండితులు విభేదిస్తున్నారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)