te_tn/tit/front/intro.md

5.9 KiB
Raw Permalink Blame History

తీతు పత్రిక పరిచయం

భాగము 1: సాధారణ పరిచయం

తీతు పత్రిక యొక్క గ్రంధ విభజన

  1. దైవ భక్తి గల నాయకులను నియమించమని పౌలు తీతుకు సూచిస్తున్నాడు (1: 1-16)
  2. దైవ భక్తి గల జీవితాలను గడపునట్లు ప్రజలకు శిక్షణ ఇవ్వాలని పౌలు తీతుకు సూచిస్తున్నాడు (2: 1-3: 11)
  3. పౌలు తన ప్రణాళికలను పంచుకోవడం ద్వారా మరియు వివిధ విశ్వాసులకు శుభములు తెలియజేయడం ద్వారా ముగించాడు (3: 12-15)

తీతు పత్రికను ఎవరు రాశారు?

పౌలు తీతు పుస్తకాన్ని వ్రాసాడు. పౌలు తార్సు నగరానికి చెందినవాడు. అతను తన ప్రారంభ జీవితంలో సౌలుగా సుపరిచితుడు. క్రైస్తవుడు కాకముందు పౌలు ఒక పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించాడు. అతను క్రైస్తవుడైన తరువాత, రోమా సామ్రాజ్యం అంతటా యేసును గురించి ప్రజలకు చెప్తూ అనేకసార్లు ప్రయాణించాడు.

తీతు పత్రిక యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

పౌలు క్రేతు ద్వీప౦లో సంఘాలను నడిపిస్తున్న తన జత పనివాడు అయిన తీతుకు ఈ ఉత్తరాన్ని రాశాడు,సంఘ నాయకులను ఎన్నుకోవడం గురించి పౌలు అతనికి హెచ్చరించాడు. విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలో కూడా పౌలు వివరించాడు. మరియు దేవునికి నచ్చే విధంగా జీవించమని అతను వారందరినీ ప్రోత్సహించాడు.

ఈ పత్రిక యొక్క శీర్షికను ఎలా తర్జుమా చేయవచ్చు?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షికయైన ""తీతు"" అని పిలవడాన్ని ఎంచుకోవచ్చు. లేదా వారు ""పౌలు తీతుకు రాసిన పత్రిక"" లేదా ""తీతుకు వ్రాసిన పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక భావనలు

సంఘంలో ప్రజలు ఏ పాత్రలలో సేవ చేయవచ్చు?

స్త్రీ లేదా విడాకులు తీసుకున్న పురుషుడు సంఘంలో నాయకత్వ స్థానాల్లో పనిచేయగలరా అనే దాని గురించి తీతు పుస్తకంలో కొన్ని బోధలు ఉన్నాయి. ఈ బోధల యొక్క భావం విషయంలో పండితులు విభేదిస్తున్నారు. ఈ పుస్తకాన్ని అనువదించడానికి ముందు ఈ విషయాలపై మరింత అధ్యయనం తప్పనిసరి కావచ్చు.

భాగ3: ముఖ్యమైన అనువాద సమస్యలు

ఆంగ్లంలో “you”

అని ఉపయోగించబడిన ఏకవచనం మరియు బహువచనం ఈ పుస్తకంలో, ""నేను"" అనే పదం పౌలును సూచిస్తుంది. అలాగే, ""you"" అనే ఆంగ్లపదం దాదాపు ఎల్లప్పుడు ఏకవచనంగా ఉండి మరియు తీతును సూచిస్తుంది. 3:15 దీనికి మినహాయింపు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

""మన రక్షకుడైన దేవుడు"" అంటే అర్ధం ఏమిటి?

ఇది ఈ పత్రికలోని ఒక సాధారణ పదబంధం. తనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పటికినీ దేవుడు క్రీస్తులో వారిని ఎలా క్షమించాడనే దాని గురించి పాఠకులు ఆలోచించేలా పౌలు ఉద్దేశించాడు. మరియు వారిని క్షమించడం ద్వారా ఆయన ప్రజలందరినీ తీర్పు తీర్చినప్పుడు శిక్షించకుండా వారిని రక్షించాడు. ""ఈ పత్రికలో వాడబడిన ఇదే విధమైన పదబంధం ""మన గొప్ప దేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు"".