te_tn/tit/03/intro.md

1.6 KiB

తీతు 03 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

పౌలు ఈ అధ్యాయంలో తీతుకు వ్యక్తిగత సూచనలు ఇస్తున్నాడు.

15 వ వచనం ఈ లేఖను అధికారికంగా ముగించింది. పురాతన సమీప తూర్పు ప్రాంతంలో ఒక లేఖను ముగించే సాధారణ పద్ధతి ఇది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

వంశవృక్షాలు

వంశవృక్షాలు ఒక వ్యక్తి యొక్క పూర్వీకులు లేదా వారసులను నమోదు చేసే జాబితాలు. రాజు కావడానికి సరైన వ్యక్తిని ఎన్నుకోవటానికి యూదులు వంశావళిని ఉపయోగించేవారు. వారు ఇలా ఎందుకు చేసేవారంటే ఒక రాజ కుమారుడు మాత్రమే సాధారణంగా రాజు అవుతాడు. వారు ఏ తెగ మరియు కుటుంబం నుండి వచ్చారో కూడా చూపించేవారు. ఉదాహరణకు, యాజకులు లేవి తెగ మరియు అహరోను కుటుంబం నుండి వచ్చేవారు.