te_tn/rom/front/intro.md

24 KiB

రోమా పత్రిక యొక్క ఉపోద్ఘాతము

భాగము 1: సహజమైన పరిచయం

రోమా పత్రిక యొక్క విభజన

  1. పరిచయం (1:1-15)
  2. ఉపోద్ఘాతము (1:1-15)
  3. యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా నీతిమంతులగుట (1:16-17)
  4. పాపమునుబట్టి మనుష్యులందరూ శిక్షించబడియున్నారు (1:18-3:20)
  5. యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా ఆయన ద్వారా నీతిమంతులగుట (3:21-4:25)
  6. ఆత్మ ఫలములు (5:1-11)
  7. ఆదాము మరియు క్రీస్తు పోల్చబడుట (5:12-21)
  8. ఈ జీవితములో క్రీస్తువలె మారుట (6:1-8:39)
  9. ఇశ్రాయేలీయులకొరకు దేవుని ప్రణాళిక (9:1-11:36)
  10. క్రైస్తవులుగా జీవించుటకొరకు ప్రయోగాత్మకమైన సలహాలు (12:1-15:13)
  11. ముగింపు మరియు శుభాకాంక్షలు (15:14-16:27)

రోమా పత్రికను ఎవరు వ్రాశారు?

రోమా పత్రికను అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. పౌలు తార్సు అనే పట్టణమునుండి వచ్చినవాడు. తను సౌలు అనే పేరుతో కూడా పిలువబడేవాడు. క్రైస్తవుడిగా మారకమునుపు, పౌలు పరిసయ్యుడైయుండెను. ఆయన క్రైస్తవులను హింసించియుండెను. ఆయన క్రైస్తవునిగా మారిన తరువాత, ఆయన యేసు ప్రభువును గూర్చి ప్రజలకు చెప్పుటకు రోమా సామ్రాజ్యమందంతట తిరిగియుండెను.

పౌలు రోమా సామ్రాజ్యములో తన మూడవ సువార్త దండయాత్ర సమయములో కొరింథులో ఉన్నప్పుడు ఈ పత్రికను వ్రాసియుండవచ్చునని.

ఈ రోమా పత్రిక దేనిని గూర్చి వ్రాయబడియున్నది?

పౌలు రోమాలోని క్రైస్తవులకు ఈ పత్రికను వ్రాసియున్నాడు. పౌలు రోమాకు వెళ్లి వారిని కలిసినప్పుడు వారు ఆయనను చేర్చుకొనుటకు సిద్ధముగా ఉండాలని కోరెను. “విశ్వాస సంబంధమైన విధేయతను” (16:26) తీసుకొని రావడమే ఆయన ఉద్దేశమని చెప్పియుండెను.

ఈ పత్రికలో పౌలు యేసు క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణముగా వివరించియున్నాడు. యూదులు మరియు యుదేతరులు పాపము చేసియున్నారని ఆయన వివరించాడు, మరియు దేవుడు వారిని క్షమిస్తాడని మరియు యేసునందు వారు విశ్వసించుట ద్వారా మాత్రమే వారు నీతిమంతులుగా తీర్చబడుతారని విశదపరచియున్నాడు (1-11 అధ్యాయములు). విశ్వాసులు ఎలా జీవించాలనే విషయములో ఆయన ప్రయోగాత్మకమైన సలహాను ఇచ్చియున్నాడు (12-16 అధ్యాయాలు),

ఈ పుస్తకము యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “రోమీయులు” అనే సంప్రదాయకమైన పేరుతో పిలుచుటకు ఎన్నుకోవచ్చును. లేక వారు “రోమాలో ఉన్న సంఘముకు పౌలు వ్రాయుచున్న పత్రిక” లేక “రోమాలోనున్న క్రైస్తవులకు ఒక పత్రిక” అనే స్పష్టమైన పేర్లను ఎన్నుకోవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతికపరమైన ముఖ్యమైన ఉద్దేశాలు

యేసును సూచించుటకు ఉపయోగించబడిన పేర్లు ఏమిటి?

రోమా పత్రికలో పౌలు యేసు క్రీస్తును వివరించుటకు అనేకమైన పేర్లను మరియు వివరణలను వాడియున్నాడు: యేసు క్రీస్తు (1:1) , దావీదు విత్తనము (1:3), దేవుని కుమారుడు (1:4), ప్రభువైన యేసు క్రీస్తు (1:7), క్రీస్తు యేసు (3:24), ప్రాయశ్చిత్తము (3:25), యేసు (3:26), మన ప్రభువైన యేసు (4:24), సైన్యములకు అధిపతియైన ప్రభువు (9;29), అడ్డురాయి మరియు అడ్డుబండ (9:33), ధర్మశాస్త్రానికి ముగింపు (10:4), విమోచకుడు (11:26), చనిపోయినవారికి సజీవులకు ప్రభువు (14:9), మరియు యెష్షయి వేరు చిగురు (15:12).

రోమా పత్రికలోని వేదాంతపరమైన పేర్లు ఎలా తర్జుమా చేయబడినవి?

నాలుగు సువార్తలలో ఉపయోగించని అనేకమైన వేదాంతపరమైన పదాలను ఈ పత్రికలో పౌలు ఉపయోగించియున్నాడు. ఆదిమ క్రైస్తవులు యేసు క్రీస్తును గూర్చి మరియు ఆయన సందేశమును గూర్చి ఎక్కువగా నేర్చుకొనియున్నారు, క్రొత్త ఆలోచనలకొరకు వారికి పదాలు మరియు భావ జాలము అవసరమైయుండెను. వాటిల్లో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి, “నిర్దోషిగా తిర్చబడడం” (5:1), “ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు” (3:20), “సమాధానపరచబడుట” (5:10), “ప్రాయశ్చిత్తము” (3:25), “పవిత్రీకరణ” (6:19), మరియు “పాత పురుషుడు” (6:6).

”ముఖ్య పదాలు” అనే నిఘంటువు ఈ పదాలను అర్థము చేసికొనుటకు తర్జుమాదారులకు సహాయపడును. (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

పైన ఇవ్వబడిన పదములను వివరించడం అంత సులభము కాదు. ఈ పదాలకు సమానమైన అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలను తర్జుమాదారుల భాషలో కనుగొనడం అంత సులభము ఏమి కాదు. ఈ పదాలకు సరిపోయిన మాటను కనుగొననవసరము లేదని చెప్పుటకు ఇది సహాయము చేస్తుంది. దీనికి బదులుగా, ఈ ఆలోచనలను వ్యక్తము చేయుటకు తర్జుమాదారులు చిన్న చిన్న మాటలుగా పొందుపరిచి చెప్పవచ్చును. ఉదాహరణకు, “సువార్త” అనే పదమును “యేసు క్రీస్తును గూర్చిన శుభవార్త” అని కూడా తర్జుమా చేయవచ్చును.

ఈ పదాలలోని కొన్ని పదాలకు ఎక్కువ అర్థాలు ఉంటాయని తర్జుమాదారులు తెలుసుకోవాలి. ఆయా వాక్యభాగమునుబట్టి గ్రంథకర్త ఉపయోగించే పదాలనుబట్టి అర్థము ఆధారపడియుంటుంది. ఉదాహరణకు “నీతిమంతము” అనే పదము కొన్నిమార్లు ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలకు లోబడుచున్నాడు అనే అర్థము కూడా ఇస్తుంది. మరికొన్నిమార్లు, “నీతిమంతము” అనే పదముకు యేసు క్రీస్తు మనకొరకు పరిపూర్ణముగా దేవుని ఆజ్ఞలకు లోబడియుండెను అని అర్థము వస్తుంది.

పౌలు చెప్పుచున్న ఇశ్రాయేలీయుల “శేషం” (11:5) అనే మాటకు అర్థము ఏమిటి?

”శేషం” అనే పదము పాతనిబంధనలోను మరియు పౌలుకును చాలా ప్రాముఖ్యమైన పదము. అశ్శూరీయులు మరియు బబులోనీయులు ఇశ్రాయేలీయుల భూమిని జయించి స్వాధీనపరచుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఇతర ప్రజలలోనికి చెదరిపోయారు లేక కొంతమంది చంపబడియున్నారు. కొంతమంది యూదులు మాత్రమే జీవముతో ఉండిరి. వారినే “శేషం” అని పిలుస్తారు.

11:1-9 వచనభాగములో పౌలు శేషించినబడిన ఇతర ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. ఈ శేషము ఎవరంటే యేసు క్రీస్తునందు విశ్వసించిన మరియు దేవుడు రక్షించిన యూదులైయుండిరి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/remnant)

భాగము 3: తర్జుమాపరమైన ప్రాముఖ్యమైన భాగాలు

“క్రీస్తునందు” ఉండుట అనే మాటకు పౌలు చెప్పుచున్న అర్థము ఏమిటి?

“క్రీస్తునందు” అనే పదము మరియు ఆ పదానికి సంబంధించిన ఇతర పదాలు 3:24; 6:11,23; 8:1,2,39; 9:1; 12:5,17;15:17 మరియు 16:3,7,9,10 వచనములలో కూడా కనిపిస్తాయి. క్రైస్తవ విశ్వాసులు యేసు క్రీస్తుకు సంబంధించినవారని తెలియజెప్పుటకు పౌలు ఈ మాటలన్నిటిని రూపకఅలంకారముగా ఉపయోగించుచున్నాడు. క్రీస్తుకు సంబంధించినవారుగా ఉండడం అనగా క్రీస్తును నమ్మిన విశ్వాసి రక్షించబడియున్నాడని మరియు దేవునితో స్నేహములో శాశ్వతముగా ఉన్నాడని అర్థము. ఏది ఏమైనా , ఈ ఆలోచనను అనేక భాషలలో స్పష్టముగా చెప్పడం క్లిష్టతరమే.

పౌలు ఆ వాక్యములన్నిటిని ఒక నిర్థిష్టమైన వాక్యభాగములో ఎలా ఉపయోగించియున్నడనే దాని మీద ఈ మాటలకు ఒక ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, 3:24లో (క్రిస్తునందున్న విమోచనము”), “ఎందుకంటే” యేసు క్రీస్తునుబట్టి మనము విమోచించబడియున్నామని పౌలు సూచించుచున్నాడు. 8:9 వచనములో (“మీరు శరీరములో లేరుగాని ఆత్మలో ఉన్నారు”), విశ్వాసులు పరిశుద్దాత్మకు సమర్పించుకొనియున్నారని పౌలు మాట్లాడియున్నాడు. 9:1 వచనములో (“క్రీస్తునందున్న సత్యమును నేను చెప్పుచున్నాను”), ఇక్కడ పౌలు యొక్క అర్థము ఏమిటంటే యేసు క్రీస్తుతో చేయబడిన “ఒడంబడిక” సత్యమును ఆయన చెప్పుచున్నాడని అర్థము.

అయినప్పటికీ, యేసు క్రీస్తుతో(మరియు (పరిశుద్ధాత్మతో) ఏకమైయున్నామనే ప్రాథమికమైన ఆలోచన ఈ వాక్యభాగములన్నిటిలో కనిపిస్తుంది. అందుచేత, “నందు లేక లో” అనే క్రియాపదమును ఉపయోగించబడిన అనేక వాక్యభాగములలో తర్జుమాదారుడు స్వేచ్చను కలిగియున్నాడు. “లో లేక నందు” అనే క్రియాపదముకుగల తక్షణ ఆలోచనను తెలియజెప్పుటకు అనేకమార్లు అతను “అందునుబట్టి,” “ఆ ప్రకారము,” లేక “దానికి సంబంధించి” అని తెలియజెప్పుటకు నిర్ణయించుకొనియున్నాడు. అయితే, “ఏకమైయున్నాము” అనే అర్థమును ఇవ్వగలిగే తక్షణ భావమును సూచించే పదమునుగాని లేక వాక్యమునుగాని తర్జుమాదారుడు ఎన్నుకోవాలి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/inchrist)

యుఎల్.టి(ULT) లోని రోమా పత్రికలో “పరిశుద్ధత,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధులైనవారు,” మరియు “పవిత్రీకరణ” అనే పదాలు ఎలా సూచించబడియున్నాయి?

ఇతర విభిన్నమైన ఆలోచనలను సూచించుటకు లేఖనములు అటువంటి పదాలను ఉపయోగిస్తాయి. ఈ కారణముచేత, తర్జుమాదారులు తమ తమ భాషలలో వాటిని చక్కగా స్పష్టతగా తెలియజెప్పడానికి వాటిని తర్జుమా చేయడం తర్జుమాదారులకు అనేకమార్లు ఇబ్బందిగానే ఉంటుంది. ఆంగ్లములోని తర్జుమా చేసేతప్పుడు యుఎల్.టి(ULT) ఈ క్రింది సూత్రాలను లేక నియమాలను అనుసరిస్తుంది:

  • కొన్నిమార్లు వాక్యభాగములోని అర్థము నైతిక పరిశుద్ధతను తెలియజేస్తుంది. విశేషముగా సువార్తను అర్థము చేసికొనుట ప్రాముఖ్యము, క్రైస్తవులు యేసు క్రీస్తుతో ఏకమైయున్నందున దేవుడు వారిని పాపరహిత ప్రజలుగా చూచుచున్నడనే సత్యమును వ్యక్తము చేయుటకు “పరిశుద్ధత” అనే పదమును ఉపయోగించడమైనది. దేవుడు పరిపూర్ణుడు మరియు ఏ దోషములేనివాడనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధుడు” అనే పదము ఉపయోగించబడియున్నది. మూడవ వాస్తవం ఏమనగా క్రైస్తవులు కూడా తమ్మును తాము తమ జీవితములలో నిందారహితులుగా, దోషములేనివారుగా ఉండాలనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధులు” అనే పదమును ఉపయోగించియున్నారు. ఇటువంటి సందర్భాలలో యుఎల్.టి(ULT) తర్జుమాలో “పరిశుద్ధత,” “పరిశుద్ధుడైన దేవుడు,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధ ప్రజలు” అనే పదాలను ఉపయోగించియున్నది. (చూడండి: 1:7)
  • కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము సాధారణముగా క్రైస్తవులను సూచించుచును, ఇక్కడ వారు ఎటువంటి పాత్రను పోషించనవసరము లేదు. ఇటువంటి సందర్భాలలో ఆంగ్ల భాష అనువాదం లో, సాధువులు లేక పరిశుద్దులు అనే పదమును యుఎల్.టి(ULT) “విశ్వాసి” లేక “విశ్వాసులు” అని ఉపయోగిస్తుంది. (చూడండి: 8:27; 12:13; 15:25,26,31; 16:2,15) *కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము దేవునికే ప్రతిష్టించిన వస్తువునుగాని లేక ఒకరినిగూర్చిగాని తెలియజేయును. ఇటువంటి సందర్భాలలో, యుఎల్.టి (ULT) “ప్రత్యేకించుట,” “ప్రతిష్టించుట,” లేక “ప్రత్యేకించి సమర్పించుట” అనే పదాలను ఉపయోగించును. (చూడండి: 15:16)

తర్జుమాదారులు ఈ ఆలోచనలన్నియు తమ స్వంత అనువాదములలో ఎలా చెప్పాలనేదానినిగూర్చి తర్జుమాదారులు ఆలోచించే విధముగానే యుఎస్.టి(UST) ఎల్లప్పుడూ సహాయకరముగా ఉంటుంది.

రోమా పత్రికలోని క్లిష్ట వాక్యభాగములు ఏమిటి?

ఈ క్రిందనున్న వచనముల విషయములో బైబిలు యొక్క ఆధునిక తర్జుమా పాత తర్జుమాలతో విభేధిస్తాయి. యుఎల్.టి(ULT) లో ఆధునిక తర్జుమాను కలిగియుంటుంది మరియు పాత తర్జుమా పేజి క్రింది భాగములో ఉంటుంది.

  • “మంచి కొరకే ఆయన (దేవుడు) సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు” (8:28). కొన్ని పాత తర్జుమాలలో, “మంచి కొరకే సమస్తమును జరుగుచున్నవి.”
  • “ఇది కేవలము కృప ద్వారానేగాని క్రియల ద్వారా కాదు. ఇలా కాకపోయినట్లయితే, కృప ఎప్పటికి కృపగా ఉండేది కాదు” (11:6). కొన్ని పాత తర్జుమా లలో ఈ విధముగా ఉంటుంది: “క్రియల ద్వారా అయినట్లయితే, అది కృప అనిపించుకోదు: లేకపొతే క్రియ క్రియగా ఉండేది కాదు.”

ఈ క్రిందనున్న వాక్యము బైబిలుకు సంబంధించిన పురాతన ఉత్తమ మూల ప్రతులకు సంబంధించినది కాదు. ఈ వాక్యమును చేర్చవద్దని తర్జుమాదారులకు సలహా ఇవ్వడమైనది. తర్జుమాదారులు తమ ప్రాంతములలో రెండవ అనువాదమును కలిగియున్నట్లయితే, వారు దానినే ఇక్కడ ఎన్నుకొని చేర్చుకొనవచ్చును. ఒకవేళ తర్జుమాదారులు రెండవ తర్జుమానే ఎన్నుకున్నట్లయితే ఆ మాటలు రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క మూల ప్రతిలో ఉండకపోవచ్చని చెప్పుటకు వాటిని చదరపు ఆకార బ్రాకెట్లలో పెట్టాలి ([]).

  • “మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్” (16:24)

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)