te_tn/rom/11/intro.md

25 lines
3.2 KiB
Markdown

# రోమా 11 సాధారణ అంశాలు
## నిర్మాణము మరియు క్రమపరచుట
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 9-10, 26-27 మరియు 34-35 వచనములలో ఈ విధంగా చేసియున్నది.
## ఈ అధ్యాయములోని విశేష అంశములు
### దేవుని నీతి
యూదులు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినను, వాళ్ళు దానిని సాధించలేకపోయారు అని పౌలు బోధించుచున్నాడు. మనము దేవుని నీతిని సంపాదించుకొనలేము. ఆయనను విశ్వసించినప్పుడు దేవుడు యేసు నీతిని మనకిచ్చును. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/christ]] మరియు [[rc://*/tw/dict/bible/kt/grace]])
## ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
### అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో అనేకమైన అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. దేవుడు హెబ్రీయులను మాత్రమే రక్షించడని తన చదువరులను ఒప్పించేందుకు దీనిని చేయుచున్నాడు కాబట్టి క్రైస్తవులు వెళ్లి ప్రపంచమంతటిలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/mercy]] మరియు @)
## ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర అనువాద ఇబ్బందులు
### “దేశముకాని దాని విషయమై మీరు రోషము కలిగియుండుటకు నేను మిమ్ములను రెచ్చగొట్టుచున్నాను”
హెబ్రీ ప్రజలకు రోషము పుట్టించునట్లు దేవుడు తన సంఘమును ఉపయోగించుకొనునని వివరించుటకు పౌలు ఈ ప్రవచనమును ఉపయోగించుచున్నాడు. ఇందుమూలమున వారు దేవుని కనుగొనవచ్చు మరియు సువార్తను నమ్మవచ్చు. (చూడండి: @ మరియు @ మరియు @)
.