te_tn/rom/06/intro.md

5.4 KiB

రోమా 06 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పౌలు 5వ అధ్యాయములో చెప్పినవాటికి ఒకరు కాల్పనికముగా ఎలా ఉండగలరని జవాబునిచ్చుట ద్వారా పౌలు ఈ అధ్యాయమును ఆరంభించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు

ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా

ఈ అధ్యాయములో క్రైస్తవులు రక్షణ పొందిన తరువాత వారు తమకు ఇష్టమువచ్చినట్లుగా జీవంచవచ్చుననే బోధనను పౌలు తిరస్కరించుచున్నాడు. పండితులు దీనిని “అంటినోమియనిజము” లేక “ధర్మశాస్త్రముకు విరుద్ధముగా నడుచుకోవడం” అని పిలిచారు. భక్తి సంబంధమైన జీవితమును ప్రోత్సహించుటకు, రక్షణపొందిన క్రైస్తవులకొరకు యేసు గొప్ప ధనమును చెల్లించాడు అని పౌలు తెలియజేయుచున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/save]] మరియు [[rc:///tw/dict/bible/kt/godly]])

పాపమునకు దాసులు

యేసునందు నమ్మికయుంచుటకు మునుపు, పాపము ప్రజలను బానిసలుగా చేసుకొనియుండెను. దేవుడు పాపమునకు సేవ చేయుటనుండి క్రైస్తవులను విడిపించాడు. అప్పుడు వారు తమ జీవితాలలో క్రీస్తుకు మాత్రమే సేవ చేయాలని ఎన్నుకొనియున్నారు. క్రైస్తవులు పాపము చేయుటను ఎన్నుకొనినప్పుడు, వారు ఇష్టపూర్వకముగానే పాపము చేయుటకు ఎన్నుకున్నారని పౌలు వివరించుచున్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఫలము

ఈ అధ్యాయము ఫలము యొక్క చిత్రమును ఉపయోగించుకొనుచున్నది. ఫలము యొక్క చిత్రము సహజముగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసము ఆ వ్యక్తి జీవితములో మంచి క్రియలను పుట్టించుననే విషయమును సూచించును. (చూడండి: [[rc:///tw/dict/bible/other/fruit]] మరియు [[rc:///tw/dict/bible/kt/righteous]])

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయములో అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ఈ అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుటకుగల ఉద్దేశము చదువరులు వారి పాపమును గుర్తించునట్లు చేయుటయైయున్నది. తద్వారా వారు యేసునందు విశ్వసించుదురు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///tw/dict/bible/kt/guilt]] మరియు rc://*/tw/dict/bible/kt/sin)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ప్రాముఖ్యమైన క్లిష్ట భాగములు

మరణము

పౌలు ఈ అధ్యాయములో “మరణము” అనే పదమును చాలా విధాలుగా ఉపయోగించియున్నాడు: భౌతిక మరణము, ఆత్మీయ మరణము, పాపము మనిషి హృదయములో ఏలుతూ ఉన్నది, మరియు ఒకదానికి ముగింపుయైయున్నది. క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన క్రొత్త జీవితము ద్వారా మరియు క్రైస్తవుల నూతనమైన విధానముద్వారా మరణమును మరియు పాపమును గూర్చి వివరించుచు, వారు రక్షణ పొందిన తరువాత ఎలా జీవించాలని వివరించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/other/death)