te_tn/rom/05/intro.md

5.1 KiB

రోమా.05 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

అనేకమంది పండితులు 12-17 వచనముల వాక్యభాగమును చాలా ప్రాముఖ్యమైన భాగముగా చూశారు, అయితే లేఖనములలోని ఆ వచనములు అర్థము చేసుకోవడము చాలా కష్టము. వాటి వైభవము మరియు వాటి అర్థము మూల భాషయైన గ్రీకు భాషనుండి తర్జుమా చేయునప్పుడు పోయినట్లు అనిపిస్తుంది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు

నీతిమంతునిగా తీర్చబడుటయొక్క ఫలితములు

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాగముగా మనము నీతిమంతులుగా తీర్చబడుటయొక్క ఫలితాలను పౌలు ఎలా వివరించుచున్నాడు. ఈ ఫలితాలన్నియు దేవునితో సమాధానమును కలిగియుండుటలో, దేవునితో మాట్లాడుటలో, మన భవిష్యత్తును గూర్చిన నిశ్చయతను కలిగియుండుటలో, మనము శ్రమలు పొందుచున్నప్పుడు పొందే ఆనందములో, నిత్య రక్షణను కలిగియుండుటలో, మరియు దేవునితో సమాధానపడుటలో భాగమైయుండును. (చూడండి: rc://*/tw/dict/bible/kt/justice)

“అందరును పాపము చేసియున్నారు”

పౌలు 12వ వచనములో చెప్పుచున్న మాటనుబట్టి పండితులు విడిపోయారు: “సర్వమానవాళిని పాపము వేరు చేసింది, ఎందుకంటే అందరును పాపము చేశారు.” సర్వ మానవాళి ఆదాము బీజమందున్నారు” అని కొంతమంది నమ్ముతారు. అందుచేత, సర్వమానవాళికి ఆదాము ఎలాగు తండ్రిగా ఉన్నాడో, అలాగే ఆదాము పాపము చేసినప్పుడు అందరును అక్కడే ఉన్నారు. మరికొంతమంది ఆదాము సర్వమానవాళికి ముఖ్యస్థుడుగానే ఉన్నాడు, గనుక అతను పాపము చేసినప్పుడు, ప్రజలందరూ తత్ఫలితముగా “పడిపోవాల్సిందే. ఆదాముయొక్క వాస్తవ పాపములో నేడు ప్రజలు పరోక్ష పాత్రను పోషించారా లేక ప్రత్యక్ష పాత్రను పోషించారా అనేది ఒక విషయమైతే, ఇక్కడ ఇవ్వబడిన కొన్ని దృష్టికోణములు వ్యత్యాసము చూపిస్తాయి. ఇతర వాక్యభాగములు కేవలము ఒక నిర్ణయమునకు మాత్రమే సహకరించును. (చూడండి: [[rc:///tw/dict/bible/other/seed]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)

రెండవ ఆదాము

ఆదాము మొదటి మానవుడు మరియు దేవుని మొదటి “కుమారుడు”. ఇతను దేవునిచేత చేయబడియున్నాడు. నిషేధించబడిన పండును తినుట ద్వారా ఇతను లోకములోనికి పాపమును మరియు మరణమును తీసుకొని వచ్చియున్నాడు. పౌలు ఈ అధ్యాయములో యేసు “రెండవ ఆదాముగా” వివరించి చెప్పుచున్నాడు మరియు ఈయనే నిజమైన కుమారుడు అని చెప్పుచున్నాడు. ఈయన సిలువలో మరణించుట ద్వారా పాపమును మరియు మరణమును జయించి జీవమును తీసుకొనివచ్చియున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofgod]] మరియు [[rc:///tw/dict/bible/other/death]])