te_tn/rom/03/intro.md

2.7 KiB

రోమా 03 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన 4వ వచనమును మరియు ఈ అధ్యాయములోని 10-18 వచనములను చేసియున్నారు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు

”అన్యునిగానున్న వ్యక్తిపైన యూదుడిగా ఉండుటవలన కలుగు ప్రయోజనము ఏది?” అనే ఈ ప్రశ్నకు 3వ అధ్యాయము జవాబులను ఇచ్చును (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు [[rc:///tw/dict/bible/kt/save]])

“అందరూ పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందనొల్లకపోయిరి”

ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరలోకములో ఆయనతోనున్న ప్రతియొక్కరు పరిపూర్ణులైయుండవలెను. ఏ పాపమైన ఒక వ్యక్తిని ఖండించును. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు [[rc:///tw/dict/bible/kt/condemn]])

ఈ అధ్యాయములో ప్రాముఖమైన అలంకారములు

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయములో తరచుగా అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ఈ పత్రికను చదువుచున్న చదువరి వారి పాపమును చూచునట్లు చేయడమే ఈ అలంకారిక ప్రశ్నల ఉద్దేశమన్నట్లుగా కనబడుచున్నది. తద్వారా వారు యేసునందు విశ్వసించుదురు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/justice]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]])