te_tn/rom/02/intro.md

5.6 KiB

రోమా 02 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయము ఈ పుస్తకముయొక్క చదువరులైన రోమా క్రైస్తవులనుండి ఇతర ప్రజలకు “తీర్పు తీర్చే” ప్రజల వైపుకు మరియు యేసునందు విశ్వసించనివారి వైపుకు మరలుతుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/judge]] మరియు [[rc:///tw/dict/bible/kt/believe]])

“అందువలన మీకు క్షమాపణ”

ఈ మాట 1వ అధ్యాయమును జ్ఞాపకము చేయును. మరికొన్ని విధానములలో ఈ మాట 1వ అధ్యాయము బోధించువాటికి ముగింపు పలుకుతుంది. ఈ మాట లోకములోని ప్రతియొక్కరు నిజమైన దేవునిని ఎందుకు ఆరాధించాలనే విషయమును తెలియజేస్తుంది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

“ధర్మశాస్త్రమును నెరవేర్చువారు”

ధర్మశాస్త్రమునకు విధేయులగుటకు ప్రయత్నము చేయువారందరూ నీతిమంతులుగా తీర్పు తీర్చబడరు. యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా పరిగణించబడినవారందరూ దేవుని ఆజ్ఞలకు లోబడుట ద్వారా విశ్వాసము నిజమని చూపించుకోవాలి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/justice]] మరియు [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

ఈ అధ్యాయములో ఎదురైయే ప్రాముఖ్యమైన అలంకార పదాలు

అలంకారిక ప్రశ్నలు

ఈ అధ్యాయములో పౌలు అనేకమైన అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. చదువరులు తమ పాపములను చూసుకోవాలని తద్వారా వారు యేసును అంగీకరించాలనేది ఈ ప్రశ్నల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఉన్నట్లుగా మనకు కనబడుచున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]],[[rc:///tw/dict/bible/kt/guilt]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]])

ఊహాత్మక పరిస్థితులు

సందర్భములో, 7వ వచనములో “ఆయన జీవమిచ్చును” అనే మాట ఊహాత్మక పరిస్థితిగా ఉన్నది. ఒక వ్యక్తి పరిపక్వమైన జీవితము కలిగియున్నప్పుడు, వారు నిత్య జీవమును బహుమానముగా సంపాదించుకొనెదరు. అయితే యేసు మాత్రమే ఆ పరిపక్వమైన జీవితమును జీవించుటకు సాధ్యమైనది.

17-29 వచనములలో పౌలు మరియొక ఊహాత్మక పరిస్థితిని ఇచ్చుచున్నాడు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రమునకు విధేయులుగా ఉండుటకు మనఃపూర్వకముగా ప్రయత్నించిన వారుకూడా ఆ ధర్మశాస్త్రమును ధిక్కరించినవారుగా వారు నిందించబడియున్నారని ఇక్కడ అతడు వివరించుచున్నాడు. ఆంగ్ల భాషలో, ధర్మశాస్త్రము యొక్క “అక్షరములను” వెంబడించుచు ధర్మశాస్త్రము యొక్క “ఆత్మను” వెంబడించని వారిని గూర్చి ఇది సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర అనువాద ఇబ్బందులు

“తీర్పు తీర్చు నీవు”

కొన్ని సందర్భాల్లో, దీనిని సులువుగా తర్జుమా చేయవచ్చును. అయితే ఇది ఇంత ఘోరముగా తర్జుమా చేయబడడానికి కారణమేమిటంటే పౌలు “తీర్పు చేయువారు” అని చెప్పుచునే అందరు తీర్పు చేయుచున్నారని కూడా చెప్పుచున్నాడు. “తీర్పు చేయువారు (మరియు తీర్పు చేయు అందరు)” అని దీనిని అనువాదం చేసే అవకాశం కలదు.