te_tn/rom/01/17.md

2.3 KiB

For in it

ఇక్కడ “దాని” అనే పదము సువార్తను సూచించుచున్నది. పౌలు సువార్తను సంపూర్ణముగా ఎందుకు నమ్ముచున్నాడో వివరించుచున్నాడు.

God's righteousness is revealed from faith to faith

దేవుడు ప్రజలకు భౌతికముగా చూపించే ఒక వస్తువన్నట్లుగా పౌలు సువార్త సందేశమునుగూర్చి మాట్లాడుచున్నాడు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు ఆరంభమునుండి అంతమువరకు నీతిమంతులుగా మార్చబడేది కేవలము విశ్వాసము ద్వారానే అని దేవుడు మనకు తెలియజెప్పుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

as it has been written

మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో ఎవరో ఒకరు వ్రాసియున్నట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The righteous will live by faith

ఇక్కడ “నీతిమంతుడు” అనే పదము దేవునియందు నమ్మికయుంచిన వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మికయుంచిన ప్రజలను దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు, మరియు వారు సదాకాలము జీవించుచూ ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)