te_tn/rev/10/intro.md

2.1 KiB

ప్రకటన 10 సాధారణ అంశములు

ఈ అధ్యాయములోని విశేషమైన సంగతులు

ఏడు ఉరుములు

ఏడు ఉరుములు శబ్దములు చేయగా అవి అతనికి మాటలుగా అర్థమైనవని యోహాను ఇక్కడ వివరించుచున్నాడు. అయితే, ఈ వచనములను తర్జుమా చేస్తున్నప్పుడు “ఉరుము” అనే పదానికి వారి భాషలో ఉపయోగించే సాధారణ పదమే ఉపయోగించాలి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

“దేవుని గూర్చిన రహస్యము”

దేవుని ప్రణాళికలో దాచిన ఒక అంశాన్ని ఇది సూచిస్తుంది. దీనిని తర్జుమా చేయడానికి ఆ రహస్యమేమని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/reveal)

ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

ఉపమాలంకారం

శక్తివంతమైన దూత యొక్క ముఖము, కాళ్ళు మరియు స్వరమును వివరించుటకు యోహాను ఉపమాలంకారమును ఉపయోగించియున్నాడు. ఈ అధ్యాయంలో చెప్పిన ఇంద్రధనస్సు మరియు మేఘము వంటి ఇతర వస్తువులను గూర్చి సహజమైన వాటి అర్థములను అనువాదకులు అర్థం చేసుకోవాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)