te_tn/rev/08/intro.md

2.5 KiB

ప్రకటన 08వ అధ్యాయం సాధారణ విషయాలు

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన ఉద్దేశాలు లేదా అంశాలు

ఏడు ముద్రలు మరియు ఏడు బూరలు

గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు ఏమి జరిగిందని చూపించుటకు ఈ అధ్యాయం ఆరంభం అవుతుంది. భూమి మీద విచిత్రమైన కార్యములు జరుగుటకు దేవుడు విశ్వాసులందరి ప్రార్థనలను ఉపయోగించుకొనును. ఆ తరువాత యోహాను ఏడు బూరలలో మొదటి నాలుగు బూరలను దూతలు ఊదినప్పుడు ఏమి జరుగుననే విషయాలను వివరిస్తూన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అలంకారములు

పరోక్ష స్వరము

యోహాను ఈ అధ్యాయంలో అనేకమార్లు పరోక్ష స్వరమును ఉపయోగించియున్నాడు. దీని ద్వారా క్రియను ఎవరు చేయుచున్నారని తెలుసుకోవడము అదృశ్యముగా ఉన్నది. తర్జుమాదారుని భాషలో పరోక్ష స్వరము లేకపోయినట్లయితే దీనిని తెలియజేయడం చాలా కష్టం. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

ఉపమానములు

8 మరియు 10 వచనాలలో యోహాను తాను చూసిన దర్శనములోని చిత్రాలను వివరించే ప్రయత్నం చేయుటలో ఉపమానములను ఉపయోగించుచున్నాడు. ఆయన తన చిత్రములను దైనందిన విషయాలకు పోల్చి చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)