te_tn/rev/05/intro.md

5.4 KiB

ప్రకటన 05వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

.

చదవడానికి సులభముగా ఉండుటకు కొన్ని తర్జుమాలు పాతనిబంధన నుండి తీసిన కొన్ని వ్యాఖ్యలు పేజిలో కుడి వైపున పెట్టి ఉంటారు. 9-13 వచనములలో క్రోఢీకరించిన మాటలను తీసి యుఎల్.టి(ULT) తర్జుమాలో అదే విధముగా పెట్టడం జరిగింది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశములు లేక అంశాలు

ముద్రించబడిన చుట్ట

యోహాను కాలంలో రాజులు, ప్రాముఖ్యమైన ప్రజలు ప్రాణుల చర్మముల మీద లేక కాగితపు పెద్ద పెద్ద ముక్కల మీద ప్రాముఖ్యమైన విషయాలను వ్రాసియుండిరి. ఆ తరువాత వారు వాటిని చుట్టి, వాటి మీద కరిగించిన మైనమును వేసి కట్టి వేస్తారు. తద్వారా ఆ చుట్ట విడిపోకుండా కట్టబడియుండును. ఆ చుట్ట లేక పత్రిక ఏ వ్యక్తికి వ్రాయబడియుంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఆ ముద్రను తీసి తెరుచుటకు అధికారాన్ని కలిగియుంటాడు. ఈ అధ్యాయంలో “సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి” అని చుట్ట మీద వ్రాసిఉంది. “దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము”, “గొర్రెపిల్ల” అని పిలిచిన వ్యక్తి మాత్రమే దానిని తెరుచుటకు అధికారమును కలిగియుండెను. (చూడండి: [[rc:///tw/dict/bible/other/scroll]] మరియు [[rc:///tw/dict/bible/kt/authority]])

ఇరవై నాలుగు పెద్దలు

పెద్దలు సంఘ నాయకులైయున్నారు. ఇరవై నలుగురు పెద్దలు అన్ని కాలాలలోని సంఘమంతటికి చిహ్నంగా లేదా సంకేతముగా ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పన్నెండు మంది గోత్రీకులు, క్రొత్త నిబంధన సంఘములో అపొస్తలులు పన్నెండు మంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

క్రైస్తవ ప్రార్థనలు

క్రైస్తవ ప్రార్థనలన్నియు ధూపమువలె వివరించబడియున్నవి. క్రైస్తవ ప్రార్థనలు దేవునికి ఇష్టమైన సువాసనగా ఉంటాయి. క్రైస్తవులు ప్రార్థన చేయునప్పుడు ఆయన సంతోషముగా ఉంటాడు.

దేవుని ఏడు ఆత్మలు

ఈ ఆత్మలు [ప్రకటన.1:4] (../../rev/01/04.md) వచనములోనున్న ఏడు ఆత్మలైయున్నవి.

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అలంకారములు

రూపకఅలంకారములు

”యూదా గోత్రపు సింహం” మరియు “దావీదు చిగురు” అనే రూపకఅలంకారములు యేసును సూచించి చెప్పతుంది. యేసు యూదా గోత్రమునుండి, దావీదు కుటుంబమునుండి వచ్చినవాడు. సింహములు అనేవి క్రూరమైనవి, ప్రాణులన్నియు మరియు ప్రజలందరూ వాటికి భయపడుతారు, గనుక అందరు విధేయత చూపే రాజు కొరకు చెప్పబడిన రూపకఅలంకార మాటలైయున్నవి. “దావీదు చిగురు” అనే మాటలు దేవుడు నాటిన విత్తనముగా ఇశ్రాయేలు రాజైన దావీదును గూర్చి మాట్లాడుచున్నది మరియు ఆ విత్తనములోనుండే చిగురు పెరుగుతూ వచ్చిందన్నట్లుగా యేసును గూర్చి మాట్లాడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)