te_tn/rev/04/intro.md

4.9 KiB

ప్రకటన 04వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణం, క్రమపరచుట.

చదవడానికి సులభముగా ఉండుటకు కొన్ని తర్జుమాలు పాతనిబంధన నుండి తీసిన కొన్ని వ్యాఖ్యలు పేజిలో కుడి వైపున పెట్టి ఉంటారు. 8 మరియు 11వ వచనములలో క్రోఢీకరించిన మాటలను తీసి యుఎల్.టి(ULT) తర్జుమాలో అదే విధముగా పెట్టడం జరిగింది.

సంఘాలకు పత్రికలు వ్రాయుటం యోహాను ముగించుచున్నాడు. ఇప్పుడు దేవుడు తనకు ఇచ్చిన దర్శనాన్ని వర్ణిస్తూ ప్రారంభిస్తున్నాడు.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన ఉద్దేశాలు లేక భావనలు

సూర్యకాంత మణి, కెంపు, మరకతం

యోహాను జీవించిన కాలంలోని ప్రజలు విలువైన రాళ్ళుగా పరిగణించేవారని ఈ మాటలు ఈ ప్రత్యేకమైన రాళ్లను సూచిస్తాయి. ఈ ప్రత్యేకమైన రాళ్ళను ప్రజలు మీ సంస్కృతిలో విలువైనవిగా ఎంచకపొతే ఈ మాటలను మీరు తర్జుమా చేయడం కష్టం కావచ్చును.

ఇరవై నాలుగురు పెద్దలు

పెద్దలు సంఘ నాయకులు. ఇరవై నలుగురు పెద్దలు అన్ని కాలాల్లోని సంఘమంతటికి చిహ్నంగా లేక సంకేతంగా ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పన్నెండు మంది గోత్రీకులు మరియు క్రొత్త నిబంధన సంఘములో అపొస్తలులు పన్నెండు మంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

దేవుని ఏడు ఆత్మలు

ఈ ఆత్మలు [ప్రకటన.1:4] (../../rev/01/04.md) వచనములోనున్న ఏడు ఆత్మలైయున్నవి.

దేవునికి మహిమను చెల్లించుట

ఆయన దేవుడైనందున దేవుడు కలిగియున్న దేవుని మహిమ చాలా అందమైనది మరియు ప్రకాశవంతమైన ప్రభావం కలిగినది. ఎవరు కూడా ఆ వెలుగు వైపు చూడలేనంత ప్రకాశవంతమైన వెలుగని ఇతర బైబిలు రచయితలు వివరిస్తుంది. ఇటువంటి మహిమను ఏ ఒక్కరూ దేవునికి ఇవ్వలేరు, ఎందుకంటే అది ఆయన స్వంతము లేక అది ఆయన కలిగియున్నది. ప్రజలు దేవునికి మహిమను చెల్లించినప్పుడు లేక దేవుడు మహిమను పొందుకున్నప్పుడు, దేవుడు తన మహిమను కలిగియున్నాడని ప్రజలు చెప్పుదురు. ఆయన అటువంటి మహిమను కలిగియున్నందున ప్రజలు దేవునిని ఆరాధించాలి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/glory]] మరియు [[rc:///tw/dict/bible/kt/worthy]] మరియు rc://*/tw/dict/bible/kt/worship)

ఈ అధ్యాయంలో తర్జుమాపరమైన ఇతర కీలక విషయాలు

క్లిష్టమైన చిత్రాలు

సింహాసనంలో నుండి వెలుగులు విరజిమ్మడం, ఆత్మలైన దీపాలు, మరియు సింహాసనము ఎదుట సముద్రము అనే విషయాలను ఊహించుకోవడమే కష్టము, అందుచేత వాటి విషయమైన మాటలు తర్జుమా చేయడం కష్టము. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)