te_tn/php/04/01.md

3.0 KiB

General Information:

“నా నిజ సహకారి” అని పౌలు చెప్పినప్పుడు, “మీరు” అనే పదము ఏకవచనముగా ఉండును. పౌలు ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదు. సువార్త ప్రకటించుటలో అతను పౌలుతో సహకరించాడని పౌలు అతని పేరు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ఫిలిప్పీలొని విశ్వాసులకు పౌలు ఐక్యత గూర్చిన కొన్ని కచ్చితమైన సూచనలను మరియు ప్రభువు కొరకు వారు జీవించుటకు సహాయముచేయు సూచనలను ఇచ్చుట కొనసాగించుచున్నాడు.

Therefore, my beloved brothers whom I long for

నా సహ విశ్వాసులారా, నేను మిమ్మును ప్రేమించుచున్నాను మరియు మిమ్ములను చూచుటకు నేను ఎంతో ఆశ కలిగియున్నాను

brothers

దీనిని ఫిలిప్పీ.1:12 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

my joy and crown

ఫిలిప్పీ సంఘము అతని సంతోషముకు కారణమని చెప్పడానికి పౌలు “ఆనందము” అనే పదమును ఉపయోగించియున్నాడు. “కిరీటము” అనేది ఆకులతో చేయబడి మరియు ముఖ్యమైన ఆటలో జయించిన వ్యక్తి ఘనతకు గుర్తుగా దానిని తన తల మీద ధరించేవాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘము పౌలుకు ఘనత తెచ్చెనని “కిరీటము” అనే పదము యొక్క అర్థమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు యేసుని నమ్మియున్నారు గనుక మీరు నాకు సంతోషమును కలుగజేసియున్నారు మరియు మీరు నా బహుమానమును మరియు నా పనికి ఘనతయైయున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in this way stand firm in the Lord, beloved friends

ప్రియ స్నేహితులారా, నేను మీకు బోధించు విధముగానే ప్రభువు కొరకు మీరు జీవించుటను కొనసాగించుడి