te_tn/mrk/15/intro.md

3.7 KiB

మర్కు సువార్త 15వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

“దేవాలయలో తెర రెండుగా చినిగింది”

ప్రజలు వారి కోసం ఎవరైనా దేవునితో మాట్లాడవలసిన అవసరం ఉందని చూపించుటకు దేవాలయములోని తేర ఒక ముఖ్యమైన సంకేతమైయున్నది. ప్రజలందరూ పాపులని మరియు దేవుడు పాపమును ద్వేషిస్తున్నందునవారు నేరుగా దేవునితో మాట్లాడలేరు. ప్రజలు చేసిన పాపములకు వెల చెల్లించినందున యేసుని ప్రజలు ఇప్పుడు దేవునితో నేరుగా మాట్లాడగలరని దేవుడు తెరను చించి వేసాడు.

సమాధి

యేసుని పాతి పెట్టబడిన సమాధి (మార్కు 15:46). ధనవంతులైన యూదా కుటుంబాల వారు మరణించిన వారిని పాతిపెట్టే సమాధీయైయున్నది. అసలు ఇది ఒక రాతిలో కత్తిరించిన గదియైయున్నది. ఇది ఒక వైపున చదునైన స్థలమును కలిగియుంది, అక్కడ వారు దానిపై నూనె మరియు సుగంధ ద్రవ్యములు పోసి బట్టలో చుట్టిన తరువాత శరీరమును దానిలో ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద రాయిని చుట్టేవారు కాబట్టి లోపల ఎవరు చూడలేరు లేక ప్రవేశించలేరు.

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

వ్యంగ్యం

యేసును ఆరాధించినట్లు (మార్కు 15:19) మరియు ఒక రాజుతో మాట్లాడినట్లు నటించడం ద్వారా (మార్కు 15:18), సైమికులు మరియు యూదులు వారు యేసును ద్వేషించారని మరియు ఆయన దేవుని కుమారుడని నమ్మలేదు అని చూపించాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-irony]] మరియు [[rc:///tw/dict/bible/other/mock]])

\nఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

ఎలోయి, ఎలోయి, లామా సబక్తాని?

ఇది అరామిక్ భాషలోని వాక్యమైయున్నది. మార్కు దాని శబ్దాలకు గ్రీకు అక్షరాలను వ్రాయడం ద్వారా ప్రతిలిఖిస్తుంది. అప్పుడు ఆయన దాని అర్థమును వివరిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)