te_tn/mat/10/intro.md

3.5 KiB

మత్తయి 10 సాధారణ నోట్సు

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

పన్నెండుమంది శిష్యులను పంపడం

ఈ అధ్యాయంలోఅనేక వచనాలు ఏ విధంగా యేసు పన్నెండుమంది శిష్యులను పంపించాడో వర్ణిస్తున్నాయి. దేవుని రాజ్యం గురించి తన సందేశం వినిపించమని వారిని పంపాడు. వారు ఇశ్రాయేల్ జాతికి మాత్రమే అయన సందేశం చెప్పాలి, యూదేతరులకు కాదు.

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు.

పన్నెండుమంది శిష్యులు

ఇక్కడ పన్నెండుమంది శిష్యుల జాబితా ఉంది:

మత్తయి:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, దేశాభిమాని సీమోను, యూదా ఇస్కరియోతు.

మార్కులో:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యోహాను (వారికి యేసు బోయనెర్గెస్ అని పేరు పెట్టాడు. అంటే, పిడుగు కుమారులు), ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, దేశాభిమాని సీమోను, యూదా ఇస్కరియోతు.

లూకాలో:

సీమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, సీమోను (ఇతనికి దేశాభిమాని అని పేరు), యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు.

తద్దయి బహుశా యాకోబు కుమారుడు యూదాయే అయి ఉండ వచ్చు.

""దేవుని రాజ్యం దగ్గర పడింది""

""దేవుని రాజ్యం"" అప్పటికే ఉందా, లేక యోహాను ఈ మాటలు చెప్పిన తరువాత వచ్చిందా అనేది స్పష్టంగా లేదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా సమీపించింది అనే పదబంధం ఉపయోగిస్తాయి. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. ఇతర వాచకాలు “దగ్గర పడింది” మొదలైన పదబంధాలు ఉపయోగిస్తాయి.