te_tn/mat/05/intro.md

2.7 KiB

మత్తయి 05 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

మత్తయి 5-7 లో ఉన్న ఈ భాగాన్ని అనేకమంది కొండమీద ప్రసంగం అని పిలుస్తారు. ఇది యేసు బోధించిన సుదీర్ఘమైన పాఠం. బైబిల్లో ఈ పాఠం మూడు అధ్యాయాలుగా ఉంది, కానీ ఇది చదివే వారికి కొంత అయోమయం కలిగించవచ్చు. మీ అనువాదం ఈ వాక్య భాగాన్ని రెండు భాగాలుగా విభజిస్తే గనక చదివే వారు ఇది మొత్తం ఒకే ప్రసంగ విభాగం అని అర్థం అయ్యేలా చూడాలి.

మత్తయి 5:3-10, విభాగాన్ని నవ ధన్యతలు లేక దీవెనలు అంటారు. కొందరు కొన్ని అనువాదాలు ఇలాటి కొన్ని వచనాలను రాసేటప్పుడు పేజీలో కొద్దిగా కుడి వైపున వచ్చేలా రాస్తారు. ఈ వాక్యాల్లో ""ధన్యుడు"" అనే పదం ప్రతి సారీ వస్తుంది. ఈ పదాలను ఇలా పద్య రూపంలో రాయడం ద్వారా ఈ ఉపదేశం పద్య శైలిని చూపించ వచ్చు.

యేసు ఈ ప్రసంగంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. కాబట్టి యేసు అంశం మార్చినప్పుడల్లా ఒక లైను వదలడం ద్వారా చదివే వారికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

""ఆయన శిష్యులు""

యేసును అనుసరించిన ప్రతి వ్యక్తినీ శిష్యుడు అనవచ్చు. యేసు పన్నెండుమందిని తనను అనుసరించిన వారిలో నుండి తన సన్నిహిత శిష్యులుగా ఎన్నుకున్నాడు. ""పన్నెండుమంది శిష్యులు."" తరువాతి కాలంలో వారిని అపోస్తలులు అన్నారు.