te_tn/mat/04/intro.md

3.6 KiB

మత్తయి 04 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్నికవిత్వ రేఖ అనువాదాలు చదవడానికి సులభతరం చేయుటకు వచనాలను మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ముద్రించాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 6, 15, 16, పాత నిబంధన వచనాలు.

కొన్ని అనువాదాల్లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ఇలానే కనిపిస్తాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 10.

ఈ అధ్యాయంలో సాధ్యమైన ఇతర ఇబ్బందులు

""దేవుని రాజ్యం దగ్గర పడింది.""

యేసు ఈ మాటలు పలికినప్పుడు దీని అర్థం ""దేవుని రాజ్యం"" అనేది వర్తమానమో లేక ఇకపై రానున్నదో సరిగ్గా చెప్పలేము. ఇంగ్లీషు అనువాదాలు తరుచుగా “వచ్చేసింది” అని అర్థం ఇచ్చే పదబంధం ఉపయోగిస్తాయి. కానీ వీటిని తర్జుమా చెయ్యడం కష్టం. మరికొన్ని వాచకాలు “దగ్గర పడింది’’ లేక ‘‘సమీపంలోకి వచ్చింది” అనే మాటలు వాడతాయి.""

""నీవు దేవుని కుమారుడివైతే""

వ.3, 6లోని మాటలను సాతానుకే యేసు దేవుని కుమారుడు అవునో కాదో తెలియదు అన్నట్టు చదివే వారు అర్థం చేసుకోకూడదు. దేవుడు ఇంతకూ ముందే యేసు తన కుమారుడు అని ప్రకటించాడు. (మత్తయి 3:17), కాబట్టి సాతానుకు యేసు ఎవరో తెలుసు. యేసు రాళ్ళను రొట్టెలుగా మార్చగలడని, గోపురం పైనుండి దూకినా ఆయనకేమీ కాదనీ సాతానుకు తెలుసు. యేసు దేవుని పట్ల అవిధేయత, తన పట్ల విధేయత చూపాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఈ పదాలను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ""నువ్వు దేవుని కుమారుడవు గనక” లేక “నువ్వు దేవుని కుమారుడవు గదా. నీవు ఏమి చేయగలవో చూపించు."" (చూడండి: [[rc:///tw/dict/bible/kt/satan]] మరియు [[rc:///tw/dict/bible/kt/sonofgod]])