te_tn/luk/08/intro.md

3.0 KiB

లూకా 08 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు రూపం

ఈ అధ్యాయంలో చాలాసార్లు మార్పును గుర్తించకుండా లూకా తన అంశాన్ని మారుస్తూ వచ్చాడు. ఈ కఠినమైన మార్పులను మృదువుగా చెయ్యడానికి మీరు ప్రయత్నించకూడదు.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

అద్భుతాలు

యేసు ఒక తుఫానును దానితో మాట్లాడటం ద్వారా తుఫాను ఆపివేయ్యడం., చనిపోయిన ఒక అమ్మాయిని ఆమెతో మాట్లాడటం ద్వారా సజీవంగా చెయ్యడం, ఒక వ్యక్తిలో దురాత్మలను వాటితో మాట్లాడటం ద్వారా అవి ఆ మనిషిని విడిచిపెట్టేలా చెయ్యడం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/miracle)

ఈ అధ్యాయంలో భాషా రూపాలు

ఉపమానాలు

ఉపమానాలు అంటే ప్రభువు వారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్న పాఠాలను సులభంగా అర్థం చేసుకోడానికి ఆయన చెప్పిన చిన్న కథలు. తనను నమ్మడానికి ఇష్టపడని వారు సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండడానికి కూడా అయన కథలు చెప్పారు (లూకా 8:4-15).

ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

సహోదరులు మరియు సహోదరీలు

అనేకమంది మనుష్యులు ఒకే తల్లిదండ్రులను కలిగి ఉన్నవారిని ""సోదరుడు,"" ""సోదరి"" అని పిలుస్తారు. వారు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారు. అనేకమంది ఒకే తాత, అమ్మమ్మలు లేక నానమ్మలు ఉన్నవారిని కూడా ""సోదరుడు,"" ""సోదరి"" అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో యేసు తనకు ప్రాముఖ్యమైన మనుష్యులు పరలోకంలో తన తండ్రికి విధేయులుగా ఉంటారని చెప్పాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/brother)