te_tn/luk/07/intro.md

4.4 KiB

లూకా 07 సాధారణ వివరణ

నిర్మాణం, రూపం

కొన్ని అనువాదాలు పాత ఉపవాక్యం నుండి తీసుకొన్న ఉల్లేఖనాలను మిగిలిన వచన భాగం తరువాత ఉంచడం కంటే పేజీలో కుడి వైపుకు దూరంగా ఉంచుతాయి. 7:27 లోని ఉల్లేఖించిన సారాంశంతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.

ఈ అధ్యాయంలో చాలాసార్లు లూకా మార్పును గుర్తించకుండా తన అంశాన్ని మార్చుతున్నాడు. ఈ కఠినమైన మార్పులను సున్నితంగా చేయడానికి మీరు ప్రయత్నించకూడదు.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

శతాధిపతి

తన దాసుడిని స్వస్థపరచమని యేసును కోరిన శతాధిపతి ([లూకా 7: 2] (../../luk/07/02.md)) అనేక అసాధారణమైన పనులు చేస్తున్నాడు. ఒక రోమా సైనికుడు దాదాపు దేనికోసమైనా యూదుడి వద్దకు వెళ్ళడు, ఎక్కువ మంది ధనవంతులు తమ సేవకులను ప్రేమించరు, లేదా శ్రద్ధ చూపించరు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/centurion]] [[rc:///tw/dict/bible/kt/faith]])

బాప్తిస్మమిచ్చు యోహాను

బాప్తిస్మం తీసుకొన్నవారు తాము పాపులమనీ, తమ పాపం విషయంలో విచారపడుతున్నారని చూపించడానికి ప్రజలకు యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/repent]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

""పాపులు""

లూకా ఒక గుంపు ప్రజలను “పాపులు” అని సూచిస్తున్నాడు. యూదు నాయకులు ఈ ప్రజలను మోషే ధర్మశాస్త్రం విషయంలో అజ్ఞానులుగా యెంచుతున్నారు, అందుచేత వారిని ""పాపులు"" అని పిలిచారు. వాస్తవానికి, నాయకులే పాపులుగా ఉన్నారు. ఈ పరిస్థితిని వైపరీత్యంగా తీసుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

""పాదాలు""

పురాతన తూర్పు ప్రాంతాలలో ప్రజల పాదాలు చాలా మురికిగా ఉండేవి, ఎందుకంటే వారు చెప్పులు ధరించరు, రోడ్లు, కాలిబాటలు మురికిగానూ, బురదగానూ ఉన్నాయి. బానిసలు మాత్రమే ఇతరుల పాదాలను కడుగుతారు. యేసు పాదాలను కడిగిన స్త్రీ ఆయనకు గొప్ప గౌరవాన్ని కనుపరచింది.

ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

""మనుష్యకుమారుడు""

యేసు ఈ అధ్యాయంలో తనను తాను ""మనుష్యకుమారుడు"" అని సూచిస్తున్నాడు. (లూకా 7:34). మనుషులు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను గురించి తాము మాట్లాడడాన్ని మీ బాష అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])