te_tn/luk/02/07.md

2.0 KiB

wrapped him in long strips of cloth

కొన్ని సంస్కృతులలో తల్లులు తమ పిల్లలను వస్త్రంలో లేదా దుప్పటితో గట్టిగా చుట్టి ఆదరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దుస్తులు బిడ్డచుట్టూ గట్టిగా చుట్టారు"" లేదా ""చిన్నబిడ్డను దుప్పటిలో గట్టిగా చుట్టారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

laid him in a manger

జంతువులు తినడానికి మనుషులు ఎండుగడ్డి లేదా ఇతర ఆహారాన్ని ఉంచే ఒక రకమైన పెట్టె లేదా చట్రం ఇది. ఇది చాలావరకు శుభ్రంగా ఉంటుంది, శిశువు కోసం మెత్తగానూ, పొడిగా ఉండే ఎండుగడ్డి వంటి పరుపులా ఉండవచ్చు. జంతువులను సురక్షితంగా ఉంచడానికీ, వాటిని సులభంగా పోషించడానికీ తరచుగా వాటిని ఇంటి దగ్గర ఉంచుతారు. మరియ, యోసేపులు జంతువులకు ఉపయోగించే గదిలో బస చేశారు.

there was no room for them in the inn

అతిథి గదిలో ఉండడానికి స్థలం లేదు. దీనికి కారణం చాలా మంది మనుషులు నమోదు చెయ్యడం కోసం బెత్లెహెం వెళ్లారు. లూకా దీనిని నేపథ్య సమాచారంగా జత చేసాడు (చూడండి: rc://*/ta/man/translate/writing-background)