te_tn/jhn/front/intro.md

13 KiB

యోహాను సువార్త యొక్క పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

యోహాను సువార్త యొక్క విభజన

  1. యేసు ఎవరో అని ఆయనను గురించి పరిచయము (1:1-18)

  2. యేసు బాప్తిస్మము పొందారు మరియు ఆయన పండ్రెండు మంది శిష్యులను ఎన్నుకుంటారు (1:19-51)

  3. యేసు ప్రజలకు బోధిస్తారు, నేర్పిస్తారు మరియు వారిని స్వస్థపరుస్తారు (2-11)

  4. యేసు’ మరణానికి ఏడు రోజులు ముందు (12-19)

  • మరియ యేసు పాదాలకు అభిషేకం చేస్తుంది (12:1-11)
  • యేసు యెరుషలేములో గాడిదను ఎక్కుతారు (12:12-19)
  • కొంత మంది గ్రీకు పురుషులు యేసును చూడాలనుకుంటున్నారు. (12:20-36)
  • యూదు నాయకులు యేసును తిరస్కరించారు (12:37-50)
  • యేసు తన శిష్యులకు బోధిస్తారు (13-17)
  • యేసు బందింపబడ్డారు మరియు శోధనకు లోనైయ్యారు (18:1-19:15)
  • యేసు సిలువవేయబడి పాతి పెట్ట బడ్డారు (19:16-42)
  1. యేసు మృతులలో నుండి లేచారు (20:1-29)
  2. యోహాను తన సువార్తను ఎందుకు రాశాడో చెప్పాడు (20:30-31)
  3. యేసు శిష్యులతో కలుస్తారు (21)

యోహాను సువార్త దేనిని గురించి వివరించుచున్నది?

క్రొత్త నిబంధనలోని నాలుగు సువార్తలలో యోహాను సువార్త యేసు క్రీస్తు యొక్క కొంత జీవిత్తాన్ని వివరిస్తుంది. సువార్త రచయితలు యేసు ఎవరు మరియు ఆయన ఏమి చేసారు అనే విభిన్న అంశాలపై రాసారు. “యేసు క్రీస్తనియు, జీవముగల దేవుని కుమారుడని ప్రజలు నమ్మవచ్చు” అని యోహాను తన సువార్తను రాసారు (20:31).

యోహాను సువార్త మిగతా మూడు సువార్తలకన్న చాలా భిన్నంగా ఉంటుంది. ఇతర రచయితలు వారి సువార్తలలో చేర్చిన కొన్ని బోధలను మరియు సంగతులను యోహాను చేర్చలేదు. ఆలాగే, ఇతర సువార్తలలో లేని కొన్ని బోధనలను మరియు సంగతులను గురించి యోహాను రాసాడు.

యేసు తన గురించి చెప్పినది నిజమని నిరూపించడానికి యేసు చేసిన సూచనల గురించి యోహాను ఎక్కువగా రాసాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sign)

ఈ సువార్త యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాచేయువారు ఈ సువార్తను “ యోహాను సువార్త” లేక “యోహాను ప్రకారంగా వ్రాయబడిన సువార్త” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేక “యోహాను వ్రాసిన యేసు గురించిన సువార్త” అని స్పష్టంగా కనిపించే పేరును వారు ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

యోహాను సువార్తను ఎవరు రాసారు?

\nఈ సువార్తలో రచయిత పేరు ఇవ్వబడలేదు. ఏదేమైనా, ప్రారంభ క్రైస్తవ కలం నుండి, అపోస్తలుడైన యోహాను రచయిత అని చాలా మంది క్రైస్తవులు భావించారు.

భాగము 2: భక్తి పరమైన మరియు సాంస్కృతిక పరమైన ముఖ్య అంశాలు

యేసు జీవితంలోని చివరి వారం గురించి యోహాను ఎందుకు ఎక్కువ రాసాడు?

యేసు చివరి వారం గురించి చాల రాసాడు. తన చదవరులు యేసు యొక్క చివరి వారం మరియు సిలువ పై ఆయన మరణం గురించి లోతుగా ఆలోచించాలని ఆయన కోరుకున్నాడు. దేవుడు తనకు విరోధముగా పాపము చేసినందుకు వారిని క్షమించగలడని యేసు ఇష్టపూర్వకముగా మరణించాడని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sin)

భాగము 3: ముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

యోహాను సువార్తలో “ఉండి,” “నివసించు’” మరియు “కట్టుబడే” అనే పదాలకు అర్థం ఏమిటి?

యోహాను తరచుగా “ఉండి,” “నివసించు’” మరియు “కట్టుబడే” అనే పదాలను రూపకఅలకంకారాలుగా ఉపయోగించారు. యేసును మరింత తెలుసుకోవడం గురించి విశ్వాసిలో “ఉండిపోయినట్లుగా” ఒక విశ్వాసి విశ్వాసపాత్రుడు కావాలి అనే మాటను గురించి విశ్వాసిలో యేసు వాక్యం “ఉండిపోయినట్లుగా” యోహాను చెప్పాడు. ఆలాగే, ఒక వ్యక్యి ఆత్మీయంగా ఉండి మరొక వ్యక్తితో సహవాసం చేస్తే ఆ వ్యక్తిలో “ఉండిపోయినట్లుగా” యోహాను చెప్పారు. క్రైస్తవులు క్రీస్తులోను మరియు దేవునిలోను “ఉన్నారని” చెప్పబడ్డారు. తండ్రి కుమారునిలో “ఉన్నాడని”, మరియు కుమారుడు తండ్రిలో “ఉన్నాడని” చెప్పబడ్డారు. కుమారుడు విశ్వాసులలో “ఉన్నాడని” చెప్పబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా “విశ్వాసులలో ఉందును” అని చెప్పబడ్డాడు.

తర్జుమా చేయువారిలో చాల మంది ఈ ఆలోచనలను వారి భాషలలో సరిగ్గా అదే విధంగా వ్యక్తపరచటానికి అసాధ్యమౌతుంది. ఉదాహరణకు “నా మాంసాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు నాలో అతను అతనిలో నేను ఉన్నానని” చెప్పుకొనువాడు అని యోహాను చెప్పినప్పుడు ఆ క్రైస్తవులు దేవునితో ఆత్మీయంగా కలసి ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించి చెప్పాడు. (యోహాను సువార్త 6:56) యు.ఎస్.టి(UST) “నాతో కలుస్తాడు మరియు నేను అతనితో కలిసికొనెదను” అనే ఆలోచనలను ఉపయోగిస్తుంది. కాని తర్జుమా చేయువారు ఆలోచనను వ్యక్తపరచడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది.

ఈ వాక్య భాగంలో “నా మాటలు మీలో ఉంటే” (యోహాను సువార్త 15:7), యు.ఎస్.టి(UST) ఈ ఆలోచనను “మీరు నా వాక్య ప్రకారం జీవించినట్లయితే” అని వ్యక్తపరుస్తుంది. చాలా మంది తర్జుమా చేయువారు ఈ తర్జుమాను ఒక మాదిరిగా ఉపయోగించడం సాధ్యమవుతుంది.

యోహాను సువార్త యొక్క కీలక విషయాలు ఏమిటి?

క్రింది వచనాలు పరిశుద్ధ గ్రంథము యొక్క పాత తర్జుమాలలో కనుగొనబడ్డాయి కాని ఆధునిక తర్జుమాలలో ఎక్కువగా చేర్చబడలేదు. ఈ వచనాలను అనువదించవద్దని తర్జుమా చేయువారికి సూచించారు. అయినప్పటికీ, తర్జుమా చేయువారి ప్రాంతంలో ఈ వచనాలను కలిగివున్న పరిశుద్ధ గ్రంథం యొక్క పాత తర్జుమాలు ఉంటె, తర్జుమా చేయువారు వాటిని చేర్చవచ్చు. \nఅవి అనువదించబడితే, అవి బహుశః యోహాను సువార్తకు నిజముగా సంబంధించినవి కాదని సూచించడానికి చదరపు బ్రాకెట్లలో [] ఉంచాలి.

  • “ప్రజలు నీటి కదలిక కోసం వేచి ఉండేవారు. ప్రభువు దూత కొన్ని సమయాలలో కోనేటిలోనికి దిగి ఆ నీటిని కదలిస్తూ ఉండేవాడు మరియు అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది.” (5:3-4)
  • “వారి మధ్యలో నుండి వెళ్లారు మరియు ఆయన అక్కడనుండి దాటి వెళ్ళిపోయారు” (8:59)

క్రింది వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం యొక్క చాలా పాత మరియు ఆధునిక తర్జుమాలలో చేర్చబడింది. కాని అది పరిశుద్ధ గ్రంథం యొక్క మొదటి అనుకరణలలో లేదు. ఈ వచనాలను అనువదించాలని తర్జుమా చేయువారికి సూచించారు. అవి యోహాను సువార్తకు నిజముగా సంబంధించినవి కాక పోవోచ్చని సూచించడానికి చదరపు బ్రాకెట్లలో [] ఉంచాలి.

  • వ్యభిచారంలో దొరికిన స్త్రీ కథ (7:53-8:11)

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)