te_tn/jhn/19/intro.md

4.9 KiB

యోహాను సువార్త 19వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 19:24 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“ఊదా రంగు వస్త్రం”

ఊదారంగు అనేది ఎరుపు లేక నీలం లాంటి రంగు. ప్రజలు యేసును ఎగతాళి చేసారు, కాబట్టి వారు ఆయనకు ఊదారంగు వస్త్రములు ధరించారు. దీనికి కారణం రాజులైనవారు మాత్రమే ఉదారంగు వస్త్రాలను ధరించేవారు. వారు ఒక రాజుకు గౌరవం ఇస్తున్నట్లు మాట్లాడారు మరియు నడచుకున్నారు, కానీ వారు యేసును ద్వేషించినందుననే అట్లు చేస్తున్నారని అందరికి తెలుసు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

“మీరు కైసరుకు మిత్రుడువి కాదు”

యేసు నేరస్తుడు కాదని పిలాతుకు తెలుసు, కాబట్టి తన సైనికులు ఆయనను చంపడానికి ఇష్టపడలేదు. అయితే యూదులు యేసు తనను తానూ రాజు అని చెప్పుకుంటున్నాడని, మరియు అలా చేసినవారెవరైనా కైసరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. (యోహాను సువార్త 19:12).

సమాధి

యేసును పాతి పెట్టిన సమాధి (యోహాను సువార్త 19:41) ధనవంతులైన యూదా కుటుంబాల వారు మరణించిన వారిని పాతిపెట్టే సమాధియైయున్నది. అసలు ఇది ఒక రాతిలో తొలిచిన గదియైయున్నది. ఇది ఒక వైపున చదునైన స్థలమును కలిగియుంది, అక్కడ వారు దానిపై నూనె మరియు సుగంధ ద్రవ్యములు పోసి బట్టలో చుట్టిన తరువాత శరీరమును దానిలో ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద రాయిని చుట్టేవారు కాబట్టి లోపల ఎవరు చూడలేరు లేక ప్రవేశించలేరు.

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

వ్యంగ్యం

“యూదుల రాజా జయహో” అని చెప్పినప్పుడు సైనికులు యేసును అవమానించారు. “నేను మీ రాజును సిలువ వేయాలా?” అని అడుగుట ద్వారా పిలాతు యూదులను అవమానించాడు. “నజరేయుడైన యేసు యూదుల రాజు” అని వ్రాసినప్పుడు అతను యేసును మరియు యూదులను ఇద్దరినీ కూడా అవమానించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

గబ్బత, గోల్గోత

ఈ రెండు హెబ్రీ పదాలైయున్నవి. ఈ పదాల అర్థాలు (“రాళ్ళు పరచిన స్థలం” మరియు “కపాల స్థలం”) తర్జుమా చేసిన తరువాత రచయిత వారి శబ్దాలను గ్రీకు అక్షరాలతో వ్రాసి ప్రతిలిఖించారు.