te_tn/jhn/18/intro.md

4.3 KiB

యోహాను సువార్త 18వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

14వ వచనం ఇలా చెపుతుంది, “ప్రజల కోసం ఒక మనిషి చనిపోవడం మంచిదని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.” యేసును వారు కాయప దగ్గరకు ఎందుకు తీసుకువెళ్ళారో చదవరులు అర్థం చేసుకోవడానికి రచయిత ఇలా చెప్పారు. మీరు ఈ మాటలను నిక్షిప్తములో ఉంచాలనుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“ఏ మనుషినైనా మరణమునకు అప్పగించడం మనకు న్యాయయుక్తమైనది కాదు”

రోమా ప్రభుత్వం యూదులకు నేరస్తులను చంపే అనుమతిని ఇవ్వలేదు, కాబట్టి యేసును చంపాలనియూదులు రాజ్యదికారియైన పిలాతును కోరవలసి వచ్చింది. (యోహాను సువార్త 18:31).

యేసు రాజ్యం

తన రాజ్యం “ఈ లోకానికి సంబంధించినది కాదు” అని పిలాతుకు చెప్పినప్పుడు యేసు చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. (యోహాను సువార్త 18:36). కొంతమంది ప్రజలు యేసు తన రాజ్యం కేవలం ఆధ్యాత్మికమైనదని మరియు ఈ భూమిపై ఆయనకు కనిపించే రాజ్యం లేదని ఈ మాటల యొక్క అర్థం అనుకున్నారు, ఇతర రాజులు వారి రాజ్య నిర్మాణమును నిర్మించినట్లు ఆయన తన రాజ్యమును బలవంతంగా నిర్మించడు మరియు పరిపాలించడు అని యేసు చెప్పిన మాటల అర్థమైయున్నదని ఇతరులు అనుకున్నారు. “ఈ లోకానిది కాదు” అనే మాటలను “ఈ ప్రదేశం నుండి కాదు” లేక “మరొక ప్రదేశం నుండి వచ్చింది” అని తర్జుమా చేయడం సాధ్యమవుతుంది.”

యూదుల రాజు

పిలాతు యేసును నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు (యోహాను సువార్త 18:33), యూదాను పరిపాలించటానికి రోమన్లు అనుమతిస్తున్న హేరోదు రాజులాంటివారని యేసు చెప్పుకుంటున్నారా అని అతను అడుగుతున్నాడు. యూదుల రాజును విడుదల చెయాలా అని అతను జనమూహమును అడిగినప్పుడు (యోహాను సువార్త 18:39), అతను యూదులను ఎగతాళి చేస్తున్నాడు, ఎందుకంటే రోమన్లు మరియు యూదులు ఒకరినొకరు ద్వేషించేవారు. అతను యేసును కూడా అపహాస్యం చేస్తున్నాడు, ఎందుకంటే యేసు రాజు అని అతను అనుకోలేదు, (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)