te_tn/jhn/11/intro.md

4.5 KiB

యోహాను 11 సాధారణ గమనికలు

ఈ అధ్యాయము నందు గల ప్రత్యేకమైన ఉద్దేశములు

వెలుగు మరియు చీకటి

బైబిలు తరచుగా అనీతిమంతులైన ప్రజలను గురించి చెప్పుచున్నది , ఎవరైతే దేవునికి ఇష్టకరముగా ఉండరో, వారు చీకటిలో సంచరించువారు. అయితే వెలుగు ప్రజలను వారు చేస్తున్నది తప్పు అని అర్థం చేసుకోవడానికి మరియు వారు దేవునికి విధేయులుగా ఉండడానికి ,వారి పాపము నుండి విడిపించి నీతిమంతులుగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది. (చూడండి : rc://*/tw/dict/bible/kt/righteous)

పస్కా పండుగ

యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజరును మరల బ్రతికింపచేసినందుకు యూదుల పెద్దలు ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకు ఆయన ఒక చోటునుండి మరొక చోటికి రహస్యముగా ప్రయాణము చేశాడు . ఇప్పుడు పరిసయ్యులు యేసుక్రీస్తు వారు బహుశ యెరూషలేముకు రావచ్చుఅని గ్రహించి , ఆయనను పట్టుకుని చంపడానికి ప్రణాళిక వేశారు ఎందుకంటే దేవుడు యూదులు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించాలని ఆజ్ఞాపించియుండెను . (చూడండి: rc://*/tw/dict/bible/kt/passover)

ఈ అధ్యాయము నందుగల ప్రాముఖ్యమైన ప్రసంగ గణాంకాలు

”ప్రజలందరి కొరకు ఒక మనిషి చనిపోయెను”

మోషే ధర్మశాస్త్రం ప్రకారము యాజకులు జంతువులను చంపాలని అపుడు దేవుడు ప్రజల పాపములను క్షమిస్తాడని ఆజ్ఞాపించెను. ప్రధాన యజకుడైన కయప ఈలాగు చెప్పెను, “ ఈ మొత్తం దేశము నశించుటకంటే ఈ ప్రజలందరికొరకు ఒక మనిషి చనిపోవుట మేలు”([యోహాను 10:50])(../../jhn/10/50.md)). యేసుక్రీస్తు ఈలాగున చెప్పెను ఎందుకంటే ఆయన “ఆ ప్రాంతమును” మరియు “దేశమును” ప్రేమించెను ([యోహాను 10:48]) (../../jhn/10/48.md)) ఆయన లాజరును మరల బ్రతికింపచేసిన దేవునిని అంతకంటే అధికముగా ప్రేమించెను. దేవుడు రోమన్లు దేవాలయమును మరియు యెరూష లేమును నాశనము చేయకూడదని యేసుక్రీస్తును చంపుటకు కోరుకొనెను, అయితే దేవుడు తన ప్రజల పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు మరణమును కోరుకొనెను.

ఊహాత్మక పరిస్థితి

”నీవు ఇక్కడ ఉండి వుంటే, నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు” అని మార్త చెప్పెను, “ఆమె పరిస్థితి గురించి మాట్లాడుతూ జరుగుతుంది అనుకుంది కానీ జరగలేదు. యేసు రాలేదు, మరియు ఆమె తమ్ముడు చనిపోయాడు.