te_tn/jhn/09/intro.md

3.8 KiB

యోహాను సువార్త 09వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“ఎవరు పాపం చేసారు?

యేసు కాలంలోని యూదులలో చాలామంది ఒక వ్యక్తి లేక అతని తలిదండ్రులు లేక అతని కుటుంబంలో ఎవరైనా పాపం చేసారని వారు గ్రుడ్డివాడు లేక చెవిటివాడు లేక వికలాంగుడైయ్యాడని నమ్ముతారు. ఇది మోషే యొక్క ధర్మశాస్త్ర బోధ కాదు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

“ఆయన సబ్బాత్ దినమును పాటించాడు”

పరిసయ్యులు యేసు పని చేస్తున్నాడని, బురద చేయడం ద్వారా సబ్బాత్ దినమును విచ్చిన్నం చేసారని భావించారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sabbath)

అధ్యాయములోని ముఖ్యమైన రూపకఅలంకారములు

వెలుగు మరియు చీకటి పరిశుద్ద గ్రంథము తరచుగా దేవునికి నచ్చినది చేయని వ్యక్తుల గురించి, వారు చీకటిలోనే తిరుగుతున్నట్లు అని అవినీతిమంతులైనవారి గురించి చెప్పుచున్నది. ఆ పాపపు ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి, వారు ఏమి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడం ప్రారంభించినట్లుగా ఇది వెలుగు గురించి చెప్పుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

చూడడము మరియు గ్రుడ్డిగా ఉండడం

యేసు పరిసయ్యులను గ్రుడ్డివారని పిలుస్తారు ఎందుకంటే యేసు గ్రుడ్డివారిని స్వస్థపరచగలడని వారు చూస్తారు కాని దేవుడు ఆయనను పంపించాడని వారు ఇప్పటికీ నమ్మరు (యోహాను సువార్త9:39-40). (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“మనుష్య కుమారుడు”

ఈ అధ్యాయములో యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తున్నాడు (యోహాను సువార్త 9:35). మీ భాష వారు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])