te_tn/jhn/08/intro.md

4.9 KiB

యోహాను సువార్త 08వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

8:1-11 వచనాలను తర్జుమా చేయుటకు ఎందుకు ఎంచుకున్నారో లేక తర్జుమా చేయకూడదని చదవరులకు వివరించడానికి తర్జుమా చేయువారు 1వ వచనంలో ఒక గమనికను చేర్చాలనుకోవచ్చు.

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

పరిశుద్ద గ్రంథము తరచుగా దేవునికి నచ్చినది చేయని వ్యక్తుల గురించి, వారు చీకటిలోనే తిరుగుతున్నట్లు అని అవినీతిమంతులైనవారి గురించి చెప్పుచున్నది. ఆ పాపపు ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి, వారు ఏమి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడం ప్రారంభించినట్లుగా ఇది వెలుగు గురించి చెప్పుచున్నది. ఇక్కడ ఇది అన్యజనులందరిని గురించి వ్రాయబడింది (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

నేను

యేసు ఈ మాటలను ఈ పుస్తకములో నాలుగుసార్లు, ఈ అధ్యాయములో మూడు సార్లు చెప్పినట్లు యోహాను లిఖించాడు. అవి సంపూర్ణ వాక్యంగా ఉన్నాయి మరియు అవి “నేను ఉన్న వాడను” అనే హెబ్రీ మాటను అక్షరాల అనువదిస్తాయి. దీని ద్వారా యెహోవా తనను తానూ మోషేకు నిరూపించాడు. ఈ కారణాలవలన యేసు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన యెహోవా అని చెప్పుకుంటున్నాడని చాలా మంది నమ్ముతారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/yahweh).

రచయితలు మరియు పరిసయ్యుల ఉచ్చు

రచయితలు మరియు పరిసయ్యులు యేసును మోసగించాలని కోరుకున్నారు. వారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ స్త్రీని చంపడం ద్వారా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి లేక వారు మోషే ధర్మశాస్త్రానికి అవిధేయత చూపి ఆమె పాపాలను క్షమించమని ఆయన చెప్పాలని వారు కోరుకున్నారు. వారు తనను మోసగించుటకు ప్రయత్నిస్తున్నారని మరియు మోషే ధర్మశాస్త్రాన్ని వారు నిజంగా ఇష్టపడరని యేసుకు తెలుసు. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు చనిపోవాలని ధర్మశాస్త్రం చెప్పినందున ఆయనకు ఇది తెలుసు కాని వారు ఆ వ్యక్తిని యేసుని యొద్దకు తీసుకురాలేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/adultery)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“మనుష్యకుమారుడు”

ఈ అధ్యాయములో యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తున్నాడు (యోహాను సువార్త 8:28). మీ భాష వారు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])