te_tn/jhn/04/intro.md

4.6 KiB

యోహాను సువార్త 04వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

యోహాను సువార్త 4:4-38 వరకు యేసు బోధపై కేంద్రీకృతమై ఆయనను విశ్వాసించే వారందరికీ నిత్యజీవమును ఇచ్చునని ఒక కథను “జీవజలముగా” రూపొందిస్తుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్ళడం అవసరమైయున్నది”

సమరయులు భక్తిహీనుల వారసులు కాబట్టి యూదులు సమరయ ప్రాంతం గుండా ప్రయాణించడం మానేశారు. కాబట్టి చాల మంది యూదులు చేయకూడదనుకున్న దానిని యేసు చేయాల్సి వచ్చింది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/godly]] మరియు [[rc:///tw/dict/bible/names/kingdomofisrael]])

“ఆ కాలము వచ్చుచున్నది”

అరవై నిమిషాలకన్న తక్కువ లేక అంతకంటే ఎక్కువ సమయం గురించి ప్రవచనాలను ప్రారంభించడానికి యేసు ఈ వచనాలను ఉపయోగించారు. నిజమైన ఆరాధకులు ఆత్మతోను మరియు సత్యముతోను ఆరాధించే “కాలము” అరవై నిమిషాలకన్న ఎక్కువగా ఉన్నది.

సరైన ఆరాధన స్థలం

యేసు జీవించుట కంటే చాల కాలం ముందు సమరయ ప్రజలు తమ ప్రాంతంలో ఒక తప్పుడు ఆలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు (యోహాను సువార్త 4:20). ప్రజలు ఆరాధించే ఈ స్థలం ముఖ్యమైనది కాదని యేసు స్త్రీకి వివరించాడు (యోహాను సువార్త 4:21-24).

కోత కాలము

కోసిన పంట అంటే ప్రజలు తాము నాటిన ఆహారమును తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఆహారాన్ని తమ ఇళ్ళకు తెచ్చుకొని తినవచ్చు. ఆ ప్రజలు దేవుని రాజ్యములో భాగం కావాలని తన శిష్యులను వెళ్లి యేసు గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉందని బోధించడానికి యేసు దీనిని ఒక రూపకఅలంకారమువలె ఉపయోగించారు.\n(చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)

“సమరయ స్త్రీ”

యేసును విశ్వసించిన సమరయ స్త్రీకి మరియు ఆయనను విశ్వసించక మరియు తరువాత యేసును చంపిన యూదులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించుటకు యోహాను బహుశః ఈ కథను చెప్పాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“ఆత్మతో మరియు సత్యముతో”

దేవుడు ఎవరో నిజముగా తెలుసుకొని ఆయనను సంతోషంగా ఆరాధించే వ్యక్తులు మరియు ఆయనను నిజముగా సంతోషపెట్టే వారు ఆయనను ప్రేమించుదురు. వారు ఆరాధించే స్థలం ముఖ్యం కాదు.