te_tn/jas/front/intro.md

11 KiB

యాకోబు పత్రిక పరిచయం

భాగం 1: సాధారణ పరిచయం

యాకోబు పత్రిక రూపం

  1. శుభవచనాలు (1:1)
  2. .పరీక్షించడం, పరిపక్వత (1:2-18)
  3. వినడం, దేవుని వాక్య ప్రకారం చెయ్యడం (1:19-27)
  4. క్రియలలో నిజమైన విశ్వాసం కనిపిస్తుంది
  • దేవుని వాక్యం (1:19-27)
  • ప్రేమను గూర్చి శ్రేష్ఠ నియమం(2:1-13)
  • క్రియలు (2:14-26)
  1. సంఘంలో క్లిష్ట విషయాలు
  • నాలుక ప్రమాదాలు (3:1-12)
  • పైనుండి వచ్చు జ్ఞానం (3:13-18)
  • లోకసంబంధమైన ఆశలు (4:1-12)
  1. మీ నిర్ణయాల మీద దేవుని దృక్పథం
  • రేపటిని గూర్చిన అతిశయం (4:13-17)
  • సంపదను గూర్చిన హెచ్చరిక (5:13-16)
  • సహనంతో శ్రమపడడం (5:7-11)
  1. చివరి హెచ్చరికలు
  • ప్రమాణాలు (5:12)
  • ప్రార్థన, స్వస్థత (5:13-18)
  • ఒకరిపట్ల ఒకరికి శ్రద్ధ (5:19-20)

యాకోబు పత్రికను ఎవరు వ్రాసారు?

రచయిత తనను తాను యాకోబుగా గుర్తించుకొన్నాడు. ఇతడు బహుశా యేసు సవతితల్లికుమారుడు అయి ఉండవచ్చు. యాకోబు ఆదిమ సంఘంలో నాయకుడిగా ఉన్నాడు. యెరూషలేం సభలో సభ్యుడు.. అపొస్తలుడైన పౌలు కూడా ఈయనను సంఘం “స్తంభం” అని పిలిచాడు.

ఈయనా అపొస్తలుడైన యాకోబూ ఒకరే కాదు. అపొస్తలుడైన యాకోబు ఈ పత్రిక వ్రాయడానికి ముందే చంపబడ్డాడు..

యాకోబు పత్రిక దేనిని గూర్చి వ్రాయబడియున్నది?

ఈ పత్రికలో, యాకోబు శ్రమపడుతున్న విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు.వారు పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా మారడంలో సహాయం చెయ్యడానికి దేవుడు వారి శ్రమలను వినియోగిస్తున్నాడని వారితో చెప్పాడు. విశ్వాసులు మంచి పనులు చేయవలసిన అవసరాన్ని కూడా యాకోబు చెపుతున్నాడు. విశ్వాసులు ఎలా జీవించాలి, వారు ఒకరిపట్ల ఒకరు ఎలా నడుచుకోవాలి అనే దానిని గూర్చి ఎక్కువ సంగతులను యాకోను ఈ పత్రికలో రాసాడు. ఉదాహరణకు, ఒకరిపట్ల ఒకరు తమకున్న సంపదను జ్ఞానముగానే ఉపయోగించుకుంటూ, ఒకరిపట్ల ఒకరుపక్షపాతములేకుండ నడుచుకోవాలనీ, ఒకరితో ఒకరు పోట్లాడకూడదనీ, సంపదలను జ్ఞానయుక్తంగా వినియొగించాలనీ ఆజ్ఞాపించాడు.

1:6,11; 3:1-12 వచనభాగాలలో ఉన్న ప్రకారం ప్రకృతినుండి అనేకమైన ఉదాహరణలను ఉపయోగించి తన పాఠకులకు బోధించాడు. ఈ పత్రికలోని ఎక్కువ భాగాలు కొండమీద ప్రసంగంలో ప్రభువు పలికిన మాటల్లా ఉన్నాయి (మత్తయి.5-7).

“చెదరిపోయినవారిలోనున్న పన్నెండు గోత్రాల వారు” ఎవరు?

”చెదరిపోయిన పన్నెండు గోత్రములవారికి” తాను రాస్తునట్లు యాకోబు చెప్పాడు(1:1). యూదా క్రైస్తవులకు యాకోబు రాస్తున్నాడని కొందరు పండితులు ఆలోచించారు. ఇతర పండితులు సాధారణ క్రైస్తవులందరికి యాకోబు వ్రాసియుండవచ్చునని తలస్తున్నారు. ఈ పత్రికను ప్రత్యేకముగా ఒక వ్యక్తికిగాని లేక ఒక సంఘానికి వ్రాయబడియుండలేదుగనుక “సాధారణ పత్రికలలో” ఒకటిగా పిలువబడుతుంది.

ఈ పుస్తకం శీర్షిక ఏ విధంగా తర్జుమా చేయాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని సాంప్రదాయ శీర్షికతో “యాకోబు” అని పిలవడానికి ఎంపిక చెయ్యవచ్చు. లేక వారు “యాకోబునుండి వచ్చిన పత్రిక” లేక “యాకోబు వ్రాసిన పత్రిక” అని స్పష్టమైన శీర్షికనే ఎన్నుకోవచ్చును.(చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ప్రాముఖ్యమైన మత, సాంస్కృతిక అంశాలు

దేవుని ఎదుట ఒక వ్యక్తి ఏ విధముగా నీతిమంతుడిగా చేయబడుతాడనే విషయాన్ని గురించి యాకోబు పౌలుతో విభేదిస్తున్నాడా?

క్రైస్తవులు క్రియల మూలంగా కాక విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని పౌలు రోమీయులకు చెప్పాడు. క్రైస్తవులు క్రియల ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని యాకోబు చెపుతున్నట్టుగా ఉంది. ఇది కొంత కలవరంగా ఉంది. అయితే పౌలూ, యాకోబూ బోధించినదానిని సరిగా అర్థం చేసుకొన్నట్లయితే వారు ఒకరితో ఇకరు అంగీకరించినట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తి నితిమంతుడిగా తీర్చబడడానికి విశ్వాసం అవసరం అని ఇద్దరూ బోధిస్తున్నారు. నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి మంచి కార్యాలు చేసేలా కారణం అవుతుందని ఇద్దరూ బోధించారు. పౌలూ, యాకోబులిద్దరూ ఈ విషయాలను విభిన్న కోణాలలో తెలియజేశారు, ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడడం గురించి వివిధ అంశాలు తెలుసుకోగోరిన వివిధ పాఠకులు వారికున్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/justice]], [[rc:///tw/dict/bible/kt/faith]], rc://*/tw/dict/bible/kt/works)

భాగం 3: ప్రాముఖ్యమైన తర్జుమా సమస్యలు

యాకోబు పత్రికలోని అంశాల మధ్య పరస్పర సంబంధాలను ఒక తర్జుమాదారుడు ఎలా సూచించాలి?

పత్రిక దానిలోని అంశాలను వేగంగా మారుస్తుంది. కొన్నిసార్లు యాకోబు తాను తన పత్రికలో అంశాల మార్పును తన పాఠకులకు తెలియపరచడు. ఒక వచనాలు ఒకదానికొకటి విడిపోయినట్లు కనిపించినా అది అంగీకారమే. క్రొత్త పంక్తిని ఆరంభించడం లేక అంశాల మధ్య ఖాలీ స్థలాన్ని ఉంచడం అర్థవంతంగా ఉండవచ్చు.

యాకోబు పత్రికలో ముఖ్యమైన అంశాలుఏమిటి?

*“వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?”(2:20). యుఎల్.టి, యుఎస్.టి, ఆధునిక తర్జుమాలలో ఇలా ఉంది, కొన్ని పాత తర్జుమాలలో ఇలా ఉంది, “తెలివితక్కువవాడా, క్రియలు లే విశ్వాసం నిర్జీవమని తెలుసుకోడానికి నీకు ఇష్టం ఉందా? సాధారణ ప్రాంతంలో బైబిలు తర్జుమా ఉన్నట్లయితే, ఆ తర్జుమాలలో ఏ విధంగా వ్రాసారని తర్జుమాదారులు గమనించాలి. ఒకవేళ బైబిలు తర్జుమా లేకపోయినట్లయితే, ఆధునిక తర్జుమానే వెంబడించాలని తర్జుమాదారులకు సలహా ఇవ్వడమైనది.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)