te_tn/heb/09/11.md

2.5 KiB

Connecting Statement:

ధర్మశాస్త్రము ప్రకారము ప్రత్యక్షగుడారం సేవను గురించి వివరించిన తరువాత నూతన నిబంధనలో క్రీస్తు సేవ శ్రేష్ఠమైనదని గ్రంథకర్త స్పష్టం చేస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన రక్తంతో ముద్రించబడియున్నది. ప్రభువైన క్రీస్తు అసంపూర్ణమైన నకలుగా ఉన్న భూసంబంధమైన ప్రత్యక్షగుడారంలోనికి ఇతర యాజకులవలే కాకుండా నిజమైన “ప్రత్యక్షగుడారం”లోనికి అనగా పరలోకంలోని దేవుని స్వీయ సన్నిధిలోనికి ప్రవేశించాడు కనుక ఇది శ్రేష్ఠమైనది.

good things

ఇది వస్తుసంబంధ మైన వాటిని సూచించడం లేదు. దేవుడు తన నూతన నిబంధనలో వాగ్దానం చేసిన మేలైన కార్యాలను గురించి చెపుతున్నాడని అర్థం.

the greater and more perfect tabernacle

ఇది పరలోకంలోని గుడారం లేక ప్రత్యక్షగుడారాన్ని సూచించుచున్నది, ఇది భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం కంటే ప్రాముఖ్యమైనదీ, పరిపూర్ణ మైనది.

that was not made by human hands

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవ హస్తాలు దీనిని చెయ్యలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

human hands

ఇక్కడ “హస్తాలు” పదం ఒక పూర్తి వ్యక్తిని సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)