te_tn/gal/04/intro.md

3.5 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 04 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

చదవడానికి సులభముగా ఉండుటకు కొన్ని తర్జుమాలు పాతనిబంధననుండి తీసిన కొన్ని వ్యాఖ్యలు పేజిలో కుడి వైపున పెట్టి ఉంటారు. 27వ వచనములో క్రోడీకరించిన మాటలను తీసి యుఎల్టి తర్జుమాలో అదే విధముగా పెట్టడం జరిగింది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశములు లేక భావనలు

కుమారత్వము

కుమారత్వము అనేది చాలా క్లిష్టమైన విషయము. ఇశ్రాయేలు కుమారత్వము మీద పండితులు అనేకమైన దృష్టికోణములు కలిగియున్నారు. క్రీస్తునందు స్వతంత్రులైయుండుటకు మరియు ధర్మశాస్త్రమునకు లోబడియుండుటకు మధ్య వ్యత్యాసమును బోధించుటకు పౌలు కుమారత్వమును ఉపయోగించుచున్నాడు. అబ్రాహాము భౌతికసంబంధమైన సంతానములో అందరు అతనికివ్వబడిన దేవుని వాగ్ధానములను స్వతంత్రించుకొనరు. కేవలము ఇస్సాకు మరియు యాకోబుల ద్వారా తన సంతానము మాత్రమే స్వతంత్రించుకొందురు. మరియు విశ్వాసము ద్వారా అబ్రాహామును అనుసరించువారిని దేవుడు తన కుటుంబములోనికి దత్తత తీసుకొనును. వారు స్వాస్థ్యముతోపాటు దేవుని పిల్లలైయున్నారు. పౌలు వారిని “వాగ్ధాన పిల్లలని” పిలుచుచున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/inherit]], [[rc:///tw/dict/bible/kt/promise]], [[rc:///tw/dict/bible/kt/spirit]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు rc://*/tw/dict/bible/kt/adoption)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర కీలక విషయాలు

అబ్బా, తండ్రి

”అబ్బా” అనేది అరామిక్ పదము. పురాతన ఇశ్రాయేలులో, ప్రజలు సర్వ సాధారణముగా తమ పితరులను సూచించి ఉపయోగించేవారు. పౌలు ఆ పదమును ఎలా పలుకుతారో అలాగే దాని శబ్దమును గ్రీకు అక్షరాలతో వ్రాసియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)