te_tn/gal/01/intro.md

4.5 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 01 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పౌలు తాను వ్రాసిన ఇతర పత్రికలకంటే ఈ పత్రికను విభిన్నముగా వ్రాయుటకు ఆరంభించాడు. అతను “మనుష్యులవలన లేక ఇతర ఏ మానవ సంస్థవలన అపొస్తలుడు కాలేదని, కాని మృతులలోనుండి యేసును లేపిన తండ్రియైన దేవుని ద్వారా మరియు యేసు క్రీస్తు ద్వారా అపొస్తలుడైయున్నానని” అతను చేర్చియున్నాడు. పౌలు ఈ మాటలు వ్రాయుటకుగల కారణము బహుశః తప్పుడు బోధకులు అతనిని విరోధించియుండవచ్చును మరియు అతనికున్న అధికారమును తక్కువ చేయుటకు ప్రయత్నించియుండవచ్చును.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

నాస్తికత్వం

దేవుడు కేవలము వాస్తవమైన, వాక్యానుసారమైన సువార్త ద్వారా మాత్రమే ప్రజలను శాశ్వతముగా రక్షించును. దేవుడు ఇతర ఏ రకమైన సువార్తనైనను ఖండించును. తప్పుడు సువార్తను బోధించువారిని శపించాలని పౌలు దేవునిని అడుగుచున్నాడు. వారు బహుశః రక్షించబడియుండరు. వారు క్రైస్తవేతరులుగానే ఎంచబడుదురు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/save]], [[rc:///tw/dict/bible/kt/eternity]], [[rc:///tw/dict/bible/kt/goodnews]] మరియు [[rc:///tw/dict/bible/kt/condemn]] మరియు rc://*/tw/dict/bible/kt/curse)

పౌలు అర్హతలు

అన్యులు మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపించవలసిన అవసరత ఉన్నదని ఆదిమ సంఘములో కొంతమంది ప్రజలు బోధించుచుండిరి. ఈ బోధనను త్రోసిపుచ్చుటకు, 13-16 వచనములలో పౌలు రోషముగల యూదుడుగా ఎలా ఉన్నాడోనన్న విషయమును వివరించుచున్నాడు. అయినప్పటికీ దేవుడు అతనిని రక్షించవలసిన అవసరత ఉన్నది మరియు అతనికి నిజమైన సువార్తను చూపించవలసిన అవసరత కలదు. ఈ విషయాన్ని చక్కగా సూచించుటకు పౌలు యూదుడిగాను, అన్యప్రజలకు అపొస్తలుడుగాను విశేషమైన అర్హత కలిగినవాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన కీలక విషయాలు

“మీరు ఇంత త్వరగా విభిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు”

గలతీయులకు వ్రాసిన ఈ పత్రిక లేక పుస్తకము లేఖనములలోనున్న పౌలు వ్రాసిన మొదటి పత్రికలలో ఇదీ ఒకటైయుండెను. భక్తి విరుద్ధమైన అభిప్రాయాలు ఆదిమ సంఘములోను కలతను సృష్టించాయని ఈ మాటలన్నియు మనకు చూపించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)