te_tn/col/02/intro.md

2.8 KiB

కొలస్సి 02 సాధారణ అంశాలు

ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు

సున్నతి మరియు బాప్తిస్మము

11-12 వచనములలో, క్రైస్తవులు క్రీస్తు ఎలా ఐక్యమైయున్నారని మరియు వారు ఎలా పాపములనుండి విడిపించబడియున్నారని చూపించుటకు పౌలు క్రొత్త నిబంధన బాప్తిస్మము చిహ్నమును మరియు పాత నిబంధన యొక్క సున్నతి చిహ్నమును ఉపయోగించుచున్నాడు.

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగములు

శరీరము

ఇది చాలా క్లిష్ట విషయము. “శరీరము” అనేది మన పాపసంబంధమైన స్వభావము కొరకు రూపకఅలంకారముగా చెప్పబడియుండవచ్చును. మనిషిలోని భౌతిక సంబంధమైన భాగము పాపసంబంధమైనదని పౌలు బోధించుటలేదు. క్రైస్తవులమైయుండగానే (“శరీరములో”) మనము పాపము చేయుటలో కొనసాగుచున్నామనే బోధ పౌలు చేయుచున్నట్లుగా కనబడుచున్నది. అయితే మన నూతన స్వభావము మన పాత స్వభావముకు విరుద్ధముగా పోరాడుచున్నది. పౌలు ఈ అధ్యాయములో భౌతిక సంబంధమైన దేహమును సూచించుటకు “శరీరము” అనే పదమును ఉపయోగించుచున్నాడు.

అస్పష్టమైన సమాచారము

కొలస్సీలోని సంఘము యొక్క సందర్భమును గూర్చి అన్వయించుకొనే సమాచారమును పౌలు ఈ అధ్యాయములో అనేక విషయాలను క్రోడీకరించారు. వాస్తవికమైన విషయాల మీద అస్పష్టతగా ఉండుటకు వాక్యమును అనుమతించడమే ఉత్తతము. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)